మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అది పేరుకే అన్నట్లుగా బీజేపీ - శివసేనల మధ్య కొంతకాలంగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిత్రపక్షాల ప్రచ్చన్నయుద్దం కొత్త రూపును సంతరించుకుంది. ఏకంగా మోడీని ఓడించేది సేన అని ప్రచారం చేసుకుంటుండగా...తమ సత్తా చాటుతామని బీజేపీ పేర్కొంటోంది. బ్రిహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో అడవిలో సింహాన్ని పులి చంపుతున్న ఫోటోను అచ్చువేసి "పులి ఎప్పుడైనా రాజే" అని క్యాప్షన్ తో ముద్రించారు. శివసేన చిహ్నం పులికాగా... ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ సింహాన్ని మేకిన్ ఇండియాకు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామ్నా చిత్రంపై స్పందించిన బీజేపీ నేత ప్రకాశ్ మెహతా 'త్వరలో పులిని సింహం ఓడించి ముంబయి వీధుల్లో తిరుగుతుంది' అని ఘాటుగా స్పందించారు. కొద్దికాలం క్రితమే ఈ వివాదాలకు బీజం పడిందని చెప్తున్నారు. ఉద్థవ్ థాకరే కుటుంబంపై ఆధారపడి దేశప్రజలు జీవించట్లేదని బీజేపీ విమర్శించింది. అనంతరం శివసేన తన గళాన్ని వినిపిస్తూ పశ్చిమబెంగాల్ - తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా విదేశాల్లో పర్యటించిన ప్రధానమంత్రి మోడీకి కరువుతో అల్లాడుతున్న మరట్వాడాలో పర్యటించడానికి సమయం దొరకడం లేదా? అని శివసేన ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా పత్రికాముఖంగా వివాదం జరగడం మిత్రపక్షాల మధ్య గ్యాప్ ను ప్రస్పుటం చేసినట్లయిందని విశ్లేషిస్తున్నారు.