సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏ1గా అరెస్ట్ అయిన టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.
ఇక ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ పడింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
అఖిలప్రియ తాజాగా తనకు అనారోగ్యం అని.. వైద్యం అందించాలని వేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని.. వైద్యులు కూడా జైలులో అందుబాటులో ఉంటారని కోర్టు సూచించింది.
ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
ఇక శుక్రవారం అఖిలప్రియ మరో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేస్తోంది. ఇది శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు రేపు బెయిల్ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు సిద్ధమయ్యారు.