ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. భారీ గా జాబ్స్ పోవటం ఖాయమట!

Update: 2019-11-19 05:37 GMT
మాంద్యం.. మాంద్యం.. అంటూ గడిచిన కొద్ది నెలలుగా భయపెడుతున్న ఆర్థిక మాంద్యం ఇప్పుడు తన ప్రభావాన్ని చూపించటం షురూ చేసినట్లుగా చెబుతున్నారు. మాంద్యం ఎఫెక్ట్ తో  ఖర్చుల్లో కోత మొదలెట్టిన కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులకు షాకులిచ్చే పనిని షురూ చేశారు.

తాజాగా ఐటీ రంగ నిపుణుడు టీవీ మోహన్ దాస్ పాయ్ చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ తినాల్సిందే. ఆయన అంచనా ప్రకారం ఐటీలో వృద్ధి  తగ్గిందని.. ఈ ప్రభావం మధ్యశ్రేణి ఉద్యోగులపై ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాదిలో 30 నుంచి 40 వేల వరకు మధ్యశ్రేణి ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.

సానుకూల వాతావరణంలో కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రమోషన్లు ఎలా అయితే ఇస్తాయో.. ప్రతికూల పరిస్థితుల్లో చర్యలు తప్పవని.. ఉద్యోగాల తొలగింపు తప్పదన్నారు. వృద్ధి తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ ప్రభావం మధ్యశ్రేణి ఉద్యోగుల మీద ఉంటుందన్నారు.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. ఉద్యోగాలు పోగొట్టుకునే వారిలో 80 శాతం మందికి వేరేగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంపెనీలు దిద్దుబాటులో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తాయన్నారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితి తప్పదని.. కొంతకాలం ఇలాంటి పరిస్థితి తప్పదన్నారు.
Tags:    

Similar News