నందమూరి బాలకృష్ణకు షాక్.. హిందూపురంలో టీడీపీ ఓటమి

Update: 2021-03-14 09:37 GMT
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణకు గట్టి షాక్ తగిలింది. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో తొలిసారి టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ఘన విజయం సాధించి బాలయ్యకు, టీడీపీని కోలుకోలేని దెబ్బ తీసింది.

హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో వైసీపీకి 27, టీడీపీకి కేవలం 6 డివిజన్లు, బీజేపీకి 1, ఎంఐఎం1, ఇతరులు 1 వార్డును గెలుచుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలను ఎమ్మెల్యే బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ఒక అభిమాని చెంప చెళ్లు మనిపించారు కూడా. స్వయంగా రంగంలోకి దిగి రెబల్స్ తో నామినేషన్ విత్ డ్రా చేయించారు. వాడవాడలా ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

అయితే బాలయ్యకు షాకిస్తూ వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 27 డివిజన్లు గెలుచుకొని సత్తా చాటింది. ఏపీ వ్యాప్తంగా అమరావతితో సహా వైసీపీ ఫ్యాన్ గాలి వీచిందనే చెప్పాలి.
Tags:    

Similar News