అప్ఘనిస్తాన్ దేశం కేవలం 70వేల మంది ఉండే తాలిబన్ ఉగ్రవాదుల వశమైంది. 3లక్షలకు పైగా ఉన్న అప్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యం వారి ముందు తలవంచింది. ఇప్పుడు ప్రపంచం చూపు అంతా తాలిబన్ల వైపే ఉంది. అప్ఘనిస్తాన్ లోని ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ చివరకు రాజధాని కాబూల్ లోకి ప్రవేశించి విజయం సాధించారు.
అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో రాటుదేలిన అప్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యాన్ని ఓడించేందుకు తాలిబన్లు దాదాపు రెండు దశాబ్ధాల పాటు చెమటోడ్చారు. ఇటీవల అమెరికా సైన్యం నిష్క్రమణతో సునాయాసంగా దేశాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికా సైన్యం ఉన్నన్నీ రోజులు తాలిబన్ల ఆటలు సాగలేదు. వాల్లు వెళ్లిపోగానే మొత్తం కైవసం చేసుకున్నారు.
అప్ఘనిస్తాన్ ఇంత సులువుగా తాలిబన్లకు విజయం ఎలా వరించింది. వారికి నిధులు, ఆయుధాలు ఎలా వచ్చాయి? వారి ఆర్థిక మూలాలు ఏమిటీ? అన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ 2016లో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని టాప్ 10 సంపన్న ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్ స్థానం 5వది. ఈ జాబితాలో రూ.14,800 కోట్లు వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో ఉంది. రూ.2900 కోట్ల వార్షిక బడ్జెట్ తో తాలిబన్ ఐదో స్థానంలో ఉంది.
తాలిబన్ల ప్రధాన ఆదాయంలో ఎక్కువగా డ్రగ్స్ దందానే.. వీటి సరఫరా ద్వారా కోట్లు గడిస్తున్నారు. మైనింగ్ వ్యాపారాల ద్వారా కూడా భారీగా సమకూరుతోంది. 2019-20 సంవత్సరంలో తాలిబన్ల వార్షిక బడ్జెట్ దాదాపు రూ.11829 కోట్లు అని నాటో నివేదిక తెలిపింది. ఇక ఇదే సమయంలో అప్ఘనిస్తాన్ సైన్యానికి నిధుల కేటాయింపులు కేవలం రూ.800 కోట్లే. అందుకే తాలిబన్ల అత్యాధునిక ఆయుధాలు, బలం ముందు అప్ఘన్ సైన్యం తేలిపోయింది.