ఆయన వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఆ వేధింపులకు బతకడమే కష్టమని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. తమ సొంత స్థలం విషయంలో జోక్యం చేసుకున్నాడని, తన కుటుంబంలో చిచ్చుపెట్టి నరకం చూపిస్తున్నాడని ఇద్దరు పిల్లలతో సహా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెలుగులోకి రాని అనేక మంది బాధితుల ఇప్పుడు బయటకు వస్తున్నారు. అందరికీ ఒక్కరే శత్రువు .. అందరికీ ఆయనే అరాచకుడు.. ఆయనే వనమా రాఘవ. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు.
ఇటీవల రామకృష్ణ అనే వ్యక్తి వనమా రాఘవ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోలో మాట్లాడారు. ఆయన తన భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న తరువాత వనమా రాఘవ పేరు మారుమోగుతుంది. ఈ కేసులో రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
మూడు నెలల కిందట పాల్వంచకు చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి వనమా రాఘవ బాధ పడలేక చనిపోతున్నానని ఓలెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తాము ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇందులోనూ రాఘవ ప్రధాన నిందితుడిగా ఉండడంతో ఆయనపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
వాస్తవానికి ఈయన అరాచకాలు ఎప్పటి నుంచే ఉన్నాయని ఇటీవల పోలీసుల విచారణలో తేలింది. అయితే రాఘవ కు వత్తాసు పలుకుతూ ఆయన చెప్పిందల్లా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వరుస కేసులు, సంఘటనలకు రాఘవే బాధ్యుడు కావడం కలకలం రేపుతోంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తరువాత రాఘవ పరారయ్యాడు. అయితే రామకృష్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇక ఆయనను అరెస్టు చేయక తప్పలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నా బాధితులు మాత్రం రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడిగా వనమా రాఘవ షాడో ఎమ్మెల్యేగా చెలామణి అయ్యాడని బాధితులు చెబుతున్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని పలు అరాచకాలకు పాల్పడ్డారన్నారు. నియోజకవర్గంలో ఏదైనా పని కావాలంలే ఎమ్మెల్యేకు బదులు రాఘవను కలవాల్సి వచ్చేదని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ వనమా రాఘవను సస్పెండ్ చేసింది. మరోవైపు రాఘవను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.