కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడానికి ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన సామూహిక ప్రార్థనలే అని అందరికీ తెలిసిందే. దీంతో ఆ ప్రార్థనలపై ఢిల్లీలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రార్థనలపై సమగ్రంగా ఓ ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. విచారణ చేసిన వివరాలన్నింటిని నివేదికగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పోలీసులు అందించారు. అయితే ఆ నివేదిక పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఢిల్లీ పోలీసుల నివేదిక ఆశ్చర్యకరపరిచే విషయాలను వెల్లడిస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ భవన సముదాయంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు దేశవ్యాప్తంగా 16 వేల మంది పాల్గొన్నారని తేలిందని సమాచారం.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఇచ్చిన ఆ నివేదికలో చాలా షాకింగ్ విషయాలు ఉన్నాయి. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదు భవన సముదాయంలో మూడు రోజుల పాటు తబ్లిగీ జమాతీ సామూహిక మత ప్రార్థనలను నిర్వహించారు. మసీదు మతపెద్ద మౌలానా సాద్ సారథ్యంలో ఈ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. వారితోపాటు ఇండోనేషియా - మలేసియా వంటి దేశాల నుంచి కూడా వచ్చారు. ఆ మూడు రోజులతో పాటు మొత్తం మార్చి 13 నుంచి 24 తేదీ మధ్య ప్రార్థనలు జరిగాయి. ఇన్ని రోజుల్లో ఏకంగా 16 వేల మంది మత ప్రార్థనల్లో పాల్గొన్నారని గుర్తించారు.
ఆ ప్రార్థనల విషయం మొదట తెలిసినప్పుడు కేవలం రెండు నుంచి మూడు వేల మంది వరకు ఆ ప్రార్థనల్లో పాల్గొని ఉంటారని భావించారు. దానివలనే వైరస్ ఇంతగా ప్రబలిందని గుర్తించారు. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్య కారణంగా తబ్లిగీ సంస్థను చేస్తూ ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్న కొద్ది ఆశ్చర్యర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రార్థనల్లో ఢిల్లీ కాని వారు మొత్తం వెయ్యి మంది పాల్గొన్నారని మొదట తెలిసింది. వారందరి వివరాలు సేకరించి పరిశీలించగా వారంతా 15 వేల మందితో కాంటాక్ట్ అయి ఉన్నారని తేలింది. దీంతో మార్చి 13 నుంచి 24వ తేదీ మధ్య మర్కజ్ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని, వారందరూ కలిపితే దాదాపు 15 వేల మంది ఉంటారని తాజా నివేదికలో వెల్లడైంది.
కేసులు వెలుగులోకి వచ్చినప్పుడు మర్కజ్ మసీదు భవన సముదాయాన్ని ఢిల్లీ పోలీసులు మూడు రోజుల పాటు ఖాళీ చేయించారు. మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు సుమారు 2,300 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించారు. పోలీసులు స్పందించి ఖాళీ చేయించేలోపు మర్కజ్ నుంచి వందలాది మంది ప్రజలు తమ తమ ప్రాంతాలకు వెళ్లారు. ఆ వెళ్లిన వారిలో తొలిసారిగా తెలంగాణలోని కరీంనగర్ లో గుర్తించారు. 8మంది ఇండోనేషియన్లకు కరోనా వైరస్ సోకిందని గుర్తించారు. దేశవ్యాప్తంగా మర్కజ్ ప్రార్థనల కేసు తెలంగాణలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కరోనా విజృంభణకు కారణంగా పేర్కొంటూ తబ్లిగి జమాత్ సమావేశం నిర్వహించిన మౌలానా సాద్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు అందించిన నివేదికను కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.