పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ప్రధాని భద్రతపైనే నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడింది ఎవరన్న దానిపై ఆరాతీస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం దీనిపై విచారణ జరుపుతోంది.
తాజాగా ప్రధాని మోడీ కాన్వాయ్ నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకుంది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలీస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’(ఎస్ఎఫ్.జీ) నుంచి అనేక ఫోన్స్ కాల్స్ వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి నివేదించింది.
మోడీ కాన్వాయ్ ను అడ్డగించింది తామేనని ఎస్.ఎఫ్.జే పేర్కొందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎస్.జీ.వో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపవద్దని న్యాయమూర్తులను బెదిరించారని వివరించింది.
సుప్రీంకోర్టు న్యాయవాదులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్ వాలా ఫ్లైఓవర్ పై మోడీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనుక తమ హస్తం ఉందని పేర్కొన్నారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని.. వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్ కాల్ లో బెదిరించారని న్యాయవాదుల సంఘం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణ చేపడితే జాతీతయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని భయపెట్టినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.
దీనిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాలు ఉంటాయని న్యాయవాదుల ఫోన్లు హ్యాక్ గురైతే డేంజర్ అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పోలీసులకు లాయర్లు ఫిర్యాదు కూడా చేశారు.