దివ్య హత్య : తనకంటే అందగా ఉందని గుండు కొట్టించి, హత్య చేసిన యువతి ..!

Update: 2020-06-06 15:30 GMT
విశాఖపట్నం, అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరినగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం నాడు మృతి చెందిన దివ్య అనే యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతిని ముందు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో.. హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో పోలీసు జాగిలాలు దివ్యకు ఆశ్రయం కల్పించిన గూటాల వసంత, ఆమె సోదరి చుట్టూ తిరగడం, వారు ఉంటున్నఇంట్లో పరిస్ధితిని పరిశీలించిన పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

తనకంటే అందంగా ఉందనే అసూయతో దివ్యకు గుండు గీయించి, కనుబొమ్మలు గీకేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య తల్లిత్రండులు లేకపోవటంతో పిన్నివాళ్లింట్లో పెరిగింది. ఎనిమిది నెలల క్రితం విశాఖపట్నంలోని వసంత ఇంటికి వచ్చిన దివ్యతో ఆమె చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించినట్లు తెలిసింది. వసంత భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. దివ్యను అడ్డం పెట్టుకుని వసంత బాగా డబ్బుసంపాదించింది. పంపకాల విషయంలో ఇద్దరికీ తేడాలొచ్చాయి. తనకు తగినంత డబ్బులివ్వటంలేదని దివ్య వసంతను ప్రశ్నించింది. దీనితో ఇద్దరి మధ్య ఓ చిన్న గొడవ జరిగింది. దీనితో దివ్య తన ఇంటినుంచి వెళ్లిపోతుందని భయపడింది.

దీంతో తన సోదరి మరికొందరితో కలిసి దివ్యను హత్య చేయటావికి ప్లాన్ వేసింది. దివ్యను ఒక గదిలో బంధించి ఆమెకు గుండు గీయించి, కనుబొమ్మలు కత్తిరించారు. అలాగే 5 రోజుల పాటు అన్నం కూడా పెట్టకుండా హింసించారు. ఈ హింసను తాళలేక దివ్య బుధవారం రాత్రి కన్నుమూసింది. గురువారం తెల్లవారేసరికి దివ్య ఫిట్స్‌తో మరణించిదంటూ వసంత తన బంధువులకు సమాచారం ఇచ్చింది. వారంతా వచ్చి ఇంటిముందు టెంట్‌ వేసి, దివ్య మృతదేహాన్ని పూలతో కప్పేశారు. స్థానికులకు కూడా అదే విషయం చెప్పింది. అంత్యక్రియల కోసం జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాటికాపరికి సమాచారం అందించారు.

అయితే, 22 ఏళ్ల యువతి ఫిట్స్ తో మృతిచెందటం ఏంటని అనుమానం వచ్చి పోలీసులకు కాటికాపరి సమాచారం ఇవ్వడంతో ఫోర్త్ టౌన్ ఎస్ ఐ పి.సూర్యనారాయణ తన సిబ్బందితో చెక్కుడు రాయి భవనం వద్దకు చేరుకున్నాడు. మృతి చెందిన యువతి ముఖం, వీపు ఇతర భాగాలపై సిగరెట్ తో కాల్చిన వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉండటంతో పాటు మృతురాలి జుట్టు కత్తిరించి ఉంది. దీంతో ఎస్‌ఐ క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ కు తరలించారు. ఆ తరువాత వారిని అరెస్ట్ చేసి విచారించగా ఈ నిజాలు బయటపడ్డాయి. ఇక ఇప్పుడు వీరికి సహకరిచిన మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News