కరోనా మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. రోజు రోజుకూ ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69 మంది కరోనా సోకి మరణించారు.దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే .. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందించాల్సిన వారి సంఖ్య రెట్టింపు కావడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అయితే , వారందరికీ సరిపడ ఆక్సిజన్ సరఫరా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితులు అలా లేవని కరోనా బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
తాజాగా విజయనగరం జిల్లా మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఐదుగురు చనిపోయారనే ఓ వార్త కలకలం రేపింది. ఆస్పత్రి దగ్గర రోగుల బంధువల రోధనతో పరిస్థితి భయంకరంగా మారింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంతోనే తమ వారు ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. అందుకే కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని. రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ హరిజవర్‌లాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని.. అయితే వారు కూడా ఆక్సిజన్ సరఫరా అందక చనిపోలేదని వెల్లడించారు. రోజువారీ కరోనా మృతులు నేపథ్యంలో ఈ రెండు మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమే అని.. అయితే ఘటన జరిగిన వెంటనే బల్క్ సిలిండర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే మరికొందరు ప్రైవేట్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువుల పరుగులు పెడుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. వార్డుల్లో కరోనా పేషెంట్లు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. తమకు ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న భయం వాళ్లను వెంటాడుతోంది. అదే విధంగా ఈ ఘటనపై డీప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.