అమెరికా భద్రతా దళాలు అప్ఘనిస్తాన్ ను నిన్న విడిచిపెట్టిన మరుక్షణం తాలిబన్ల ఆగడాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ వారంతా రెచ్చిపోతూనే ఉన్నారు. అప్ఘనిస్తాన్ లోని కాందహార్ లో ఓ వ్యక్తిని చంపి ఏకంగా అమెరికా బ్లాక్ హాక్ హెలిక్యాప్టర్ కు ఆ మృతదేమాన్ని వేలాడదీసి ఊరేగించారు. ఈ దారుణ పరిమాణానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రపంచమంతా అవాక్కైన పరిస్థితి.
20 ఏళ్లుగా అమెరికా సైన్యం అప్ఘనిస్తాన్ లో రక్షణ చూస్తున్న అమెరికా సేనలు నిన్నటితో అక్కడి నుంచి పూర్తిగా వైదొలిగాయి. ముందుగా నిర్ధేశించిన ప్రకారం ఆగస్టు 31 తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం అప్ఘాన్ నుంచి బయలు దేరింది. అమెరికన్లు విమానాశ్రయం ఖాళీ చేయగానే తాలిబన్లు పెద్ద ఎత్తున గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలు మొదలయ్యాయి. తాజాగా కాందహార్ ప్రావిన్స్ లో పెట్రోలింగ్ చేయడానికి తాలిబన్లు తీసుకున్న అమెరికా మిలటరీ హెలిక్యాప్టర్ కు తాలిబన్లు ఓ వ్యక్తిని చంపి అతడిని వేలాడీశారు.. ఈ వీడియోను పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఆ మృతదేహం అమెరికాకు చెందిన ఓ వ్యాఖ్యతదిగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోపై అమెరికా సెనేటర్ టెడ్ క్రజ్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై మండిపడ్డారు. ఈ విపత్తును తీవ్రమైన విషాదంగా.. ఊహించలేనిదిగా వర్ణించారు.
కాగా అప్ఘనిస్తాన్ లో బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను అమెరికా దళాలు అక్కడే వదిలేశాయి. ఇప్పుడు వాటిని తాలిబన్లు ఉపయోగించుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో 73 విమానాలు, 27 హైమొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్స్ కూడా అక్కడే వదిలేశారు. వాటితోపాటు కౌంటర్ రాకెట్, మోర్టార్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ గాగుల్స్ కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. దీంతో అమెరికా చేసిన ఈ తప్పుపై చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.