సరదాగా బయటకు వెళ్లి భోజనం చేస్తే ఆ తృప్తే వేరు. రోజూ మనకు మనమే మండుకుని రెగ్యులర్ ఫూడ్ ని తినాలా? అనే భావించే కొందరు అలా వారానికి ఒకసారైనా షికారుకు వెళ్లి... ఆపై బయట ఉండే హోటళ్లు, రెస్టారెంట్లలో తినేస్తారు. నచ్చిన హోటల్ కు వెళ్లి... తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకొని క్షణాల్లో టేబుల్ మీదకు తెప్పించుకుంటారు. వాటన్నింటిని అలా టేబుల్ మీద పెట్టగానే తృప్తి పడతారు. ఇక వాటిని వెయిటర్లు కొసిరి, కొసిరి వడ్డిస్తే తింటారు.
ఆ తర్వాత వెయిటర్ సేవలకు గాను అదనంగా కొంత డబ్బు ఇస్తారు. దీన్నే టిప్పు అంటారు. ఇది హోటల్ రేంజ్ ను బట్టి ఉంటుంది. వెయిటర్ సర్వీసుల పట్ల సాటిస్ ఫై అయితే కొంత ఎక్కువ మొత్తంలో ఇస్తుంటారు. అయితే అసలు ఇవ్వని వారు కూడా ఉంటారు. అలాంటి వారి పట్ల వెయిటర్ రియాక్షన్ కేవలం మనసులోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వెయిటర్ మాత్రం తనకు టిప్పు ఇవ్వలేదని... కస్టమర్ల మీదకు దాడికి దిగడం గమనార్హం .
హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఎయిర్ పోర్టు లోని ఓ రెస్టారెంట్ కు యువకులు వెళ్లారు. అక్కడ బిర్యానీ తినాలని స్థానిక యువకులు వెళ్లారు. శుభ్రంగా భోజనం చేశారు. బిల్ పే చేసిన వెంటనే డైరెక్టుగా బయటకు వెళ్లారు. వాళ్లకు టేబుల్ వద్ద ఉండి కొసరి కొసరి వడ్డించిన వెయిటర్ కు టిప్పు ఇవ్వలేదు. అందుకోసం వెయిటర్ వారిని అడ్డగించాడు. తనకు టిప్పు ఇవ్వాలని అడిగాడు. అందుకు యువకులు నిరాకరించారు. దాంతో యువకులు, వెయిటర్ నడుమ వాగ్వాదం జరిగింది. యువకులు టిప్పు ఇవ్వడానికి ససేమిరా ఉన్నారు. దాంతో ఆగ్రహానికి గురైన వెయిటర్ వారిపై దాడి చేశాడని సంఘటనా సమయంలోో అక్కడ ఉన్న కస్టమర్లు తెలిపారు.
వెయిటర్, కస్టమర్ల మధ్య జరిగిన ఈ గొడవతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు ఆశ్చర్యపోయారు. వారిని నిలువరించడానికి ప్రయత్నించారు. అయినా గొడవ సద్దుమణగలేదు. అయితే హోటల్ సిబ్బంది కూడా వెయిటర్ కు తోడై యువకులపై దాడి చేశారని స్థానికులు చెప్పారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని... పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణ జరగడానికి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే ఈ హోటల్ పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయని స్థానికులు చెప్పారు. హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టిప్పు కోసం ఏకంగా కస్టమర్లపై దాడి చేయడం నిజంగా సంచలనంగా మారింది. టిప్ప అనేది కస్టమర్లకు నచ్చితే ఇస్తారు.... కానీ అడిగి మరీ తీసుకోవడం ఏంటని అంటున్నారు. ఈ టిప్ప గొడవ సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టడం గమనార్హం. అయితే ముక్కుపిండి టిప్పు వసూలు చేస్తారా? ఏంటి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.