రీల్ కు మించిన రియల్ దారుణం.. సుమోతో ఢీ కొట్టి.. వెంటాడి వేటకొడవలితో నరికారు
గతంలో లేని కొత్త జాఢ్యం తెలంగాణకు పట్టేసింది. ఏపీలోని కొన్నిప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పగ.. ప్రతీకారాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టేశాయి. ఎప్పుడూ లేని హింస ఇటీవల కాలంలో తెలంగాణలో తరచూ చోటు చేసుకుంటుంది. సినిమాల్లో చూపించే రాయసీమ పగకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగిన హత్యాకాండ షాకింగ్ గా మారింది. అత్తమామల కళ్ల ఎదుట.. పెద్దనాన్న కొడుకు చేసిన దారుణ హత్య భయకంపితుల్ని చేసింది. కుటుంబ కక్షల నేపథ్యంలో సాగిన ఈ దారుణహత్య రీల్ కు మించిన రియల్ సీన్ గా చెప్పాలి. ఈ హింసకు వేదికగా నల్గొండ జిల్లాలోని నారమ్మగూడెం శివారు వేదికగా మారింది. పక్కాప్లాన్ తో జరిపిన ఈ హత్యా కాండ వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని తుంగపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్రీకాంత్ తన అమ్మమ్మ దశదిశ కర్మకు హాజరయ్యేందుకు రేగులగడ్డకు వెళ్లాడు. కార్యక్రమం పూర్తి అయ్యాక అత్త..మామల్ని ఎక్కించుకొని బైక్ మీద బయలుదేరాడు. దారిలో కొందరు దుండగులు.. సుమోలో వచ్చి శ్రీకాంత్ టూవీలర్ ను ఢీ కొట్టారు. దీంతో.. ముగ్గురు కింద పడిపోయారు. ఈ అనుకోని పరిణామంతో షాక్ తిన్న అత్తమామలు.. భయపడి పక్కకు పరిగెత్తారు. కింద పడిన శ్రీకాంత్ సైతం పొలాల్లోకి పారిపోయి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
అయితే.. అతడ్ని వెంటాడిన దుండగులు చుట్టుముట్టి మెడపై వేట కొడవలితో నరికేశారు. దీంతో.. తీవ్ర రక్తస్రావానికి గురైన శ్రీకాంత్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సొంత పెద్దనాన్న కొడుకు మహేందర్ మరో నలుగురు దుండగులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హత్య జరిపిన ప్రదేశంలో దుండగులు కారం చల్లటం గమనార్హం. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే ఇలా చేశారని భావిస్తున్నారు.