అనైతిక బంధం అనేది చాలా సందర్భాల్లో విషాదంగానే ముగుస్తుంది. ఇప్పటి వరకు వందలు, వేలాది ఘటనలు ఈ విషయాన్ని నిరూపించాయి. అయినా.. కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ శివారు కేశంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాపురంలో కలతలు రావడంతో సుమారు ఐదేళ్ల కిందటే విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలోనే.. ఆమనగల్లు మండలం పోలేపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి బాటలు వేసింది.
వీరిబంధం చాలా కాలంగా సాగుతుండగా.. సదరు వ్యక్తికి ఈ మహిళపై అనుమానం పెరిగింది. తనతోనే కాకుండా.. మరో వ్యక్తితోనూ రిలేషన్ కొనసాగిస్తోందని భావించాడు. ఈ విషయమై వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 31వ తేదీన ఆమెను బైక్ పై ఎక్కించుకొని తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామశివారులోని మల్లప్పగుట్ట అడవుల్లోకి తీసుకెళ్లాడు.
ఈ విషయాన్ని ముందుగానే తన స్నేహితుడికి తెలిపాడు. దీంతో.. అతడు కూడా అనుకున్న సమయానికి స్పాట్ కు వచ్చేశాడు. ఇద్దరూ కలిసి మెడకు చున్నీ బిగించి ఆమెను చంపేశారు. అనంతరం గుట్ట పక్కనే ఉన్న పెద్ద ఉగంతలో మృతదేహాన్ని పూడ్చి వెళ్లిపోయారు.
మహిళ కనిపించకపోవడంతో పుట్టింటి వారు అన్ని చోట్లా వెతికారు. కానీ.. ఫలితం లేదు. దీంతో.. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఫోన్ ను పరిశీలించారు. కాల్ డేటా ఆధారంగా వివాహేతర బంధం కొనసాగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడంతో.. అసలు నిజం బయటపడింది. హత్య జరిగిన 23 రోజుల తర్వాత శవాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా.. సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.