ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలి అంటే అందరికి చాలా వరకు సొంత వాహనాలే ఉన్నాయి. అయితే , గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో సొంత వాహనాలు రోడ్డు మీదకి తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంధన ధరలు ఓ వైపు భయపెడుతుంటే మరో వైపు ట్రాఫిక్ చలానాలు ఇప్పుడు సామాన్యులను భారంగా మారుతున్నాయి. హెల్మెట్ లేకపోయినా , కొంచెం స్పీడ్ గా వెళ్లినా..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే, మనకు తెలియకుండానే మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్ సైట్ లో మన వెహికల్ నంబర్ పై ప్రత్యక్షం అవుతుంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉండి క్లిక్ చేసినా బండి నంబర్ సరిగ్గా పడుతుంది.
వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక ఓ యువకుడు ఏకంగా తన బైక్ పై పెట్రోల్ పోసి తగలబెట్టడం కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తలారి రత్నప్ప తనయుడు సంగప్పకు టీఎస్ 34 డీ 2183 నంబర్ గల బైక్ ఉంది.. ఆ ద్విచక్రవాహనంపై 5,500 రూపాయలు చలానాగా ఉంది. బైక్ పై కూలి పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లివస్తుంటాడు సంగప్ప.. అయితే, నిబంధనలను ఉల్లంఘించారంటూ ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయడంతో, ఆ మొత్తం 5 వేలు దాటేసింది.
ఇది చూసి తట్టుకోలేక పోయిన సంగప్ప చివరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో తాండూర్ మండల్ గౌతాపూర్ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తన బైక్ పై రూ.5 వేలుకు పైగా చలానా ఉందని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే చెల్లించాలని కోరారు. అయితే, పోలీసులు ఫోటోలు తీసి చలానాలు వేస్తున్న తీరు భరించలేక పెద్దేముల్ సొసైటీ వెనుక భాగంలో బాధితుడు సంగప్ప తన బైక్ ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. మరి రూల్ అంటే రూలే.. అందరికీ ఒక్కటే రూల్ అని పోలీసులు అనటంతో చలానాల భయానికి బైక్ నే తగలబెట్టడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చలానాల భయానికి బైక్‌నే తగలబెట్టడం మాత్రం కలకలం సృష్టిస్తోంది.