మనిషిని ఒక చోట స్థిమితంగా కూర్చోకుండా చేస్తున్న మాయదారి మహమ్మారి.. రోజుకో రూపం మార్చుకొంటోంది. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాని ప్రయాణాన్ని చూస్తే.. అస్సలు పొంతనే ఉండదు. మొదట్లో గొంతులో ఏదో మంట.. రుచి పోవటం.. వాసన పోవటం.. స్వల్ప జ్వరం.. జలుబు.. ఇలా కొన్ని లక్షణాలతో మొదలైన ఈ మాయదారి రోగం రోజులు గడుస్తున్న కొద్దీ.. కొత్త లక్షణాల్ని తెచ్చుకుంటోంది.
ఇప్పటివరకు వినని రీతిలో కొత్త లక్షణాల్ని ఇప్పుడు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొందరిలో నోరు ఎండిపోవటం.. నాలుక దురదగా అనిపించటం.. నాలుకపై గాయాలు కావటం లాంటి లక్షణాలు కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు దీన్ని కొవిడ్ టంగ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ లక్షణాలతో కొవిడ్ బారిన పడిన వారిలో విపరీతమైన నీరసం.. అలసట ఉన్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించగా.. వారిలో కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొత్త లక్షణాలు కనిపించినంతనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. ఈ కొత్త లక్షణాలకు కారణం ఏమిటి? అన్నది ఇంకా కనిపెట్టాల్సి ఉంది. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
కొవిడ్ టంగ్ ఉన్న వారిలో తొలుత నాలుక మీద మంట పుట్టటం.. దురదగా అనిపించటం.. స్వల్పమైన నొప్పి.. నాలుక పూర్తిగా ఎండిపోవటం లాంటివి కనిపిస్తాయని చెబుతున్నారు. మరికొన్ని కేసుల్లో నాలుక మీద గాయాలు కూడా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఈ కొత్త లక్షణాలు కూడా కొవిడేనని.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. ఈ కొత్త లక్షణం మీద మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం.. వారిని వెంటనే అలెర్టు చేయండి.