కరోనా వైరస్ .. కరోనా వైరస్ ఈ పేరు విని విని అందరికి విసుగు వచ్చేసింది. అయితే , విసుగు వచ్చింది కదా అని కరోనా మహమ్మారిని లైట్ తీసుకుంటే కరోనా తన పని తాను సైలెంట్ గా చేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి కరోనా తన పని తాను చేసుకునే లోపే మనం మన పని సక్రమంగా చేస్తే అన్ని పనులు ..అందరి పనులు సవ్యంగా సాగిపోతుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు ఇంకా తగ్గనే లేదు , అప్పుడే మూడో వేవ్ ముప్పు పంచుకు కూర్చుంది అని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి వేవ్ , సెకండ్ వేవ్ అంటూ కరోనా దేశాన్ని నాశనం చేసింది , ఇక మూడో వేవ్ అంటూ మళ్లీ పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మూడో ముప్పు లో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే కేంద్రం చెప్పిన కరోనా నియమాలు పాటిస్తూ , ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుండి బయటపడొచ్చు.
కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. వచ్చే రెండు నెలలు కరోనా మహమ్మారి విజృంభణ కి ఎంతో కీలకం అని , వచ్చే రెండు నెలల్లో ఎన్నో పండుగలు ఉన్నాయని , ఆ పండుగ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోని పండుగలు ఇంట్లోనే చేసుకోవాలని , అలా కాకుండా అందరూ ఒకే చోట గుంపులు గుంపులుగా చేరి పండుగలు చేసుకుంటే ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా దాని పర్యవసానం చాలా నష్టాలతో కూడి ఉంటుంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలని కేంద్రం ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇక కరోనా మహమ్మారి నుండి మనల్ని కేవలం వ్యాక్సిన్లు మాత్రమే రక్షణ మాత్రమే కల్పిస్తాయని అన్నారు. అలాగే టీకా వేసుకుంటానే ఎదో ఇక కరోనా మాకు సోకదు అనే భావన నుండి బయటకి వచ్చి కరోనా నియమాలు తప్పక పాటించాలి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ప్రతిఒక్కరూ పేస్ మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని స్పష్టంగా చెప్పారు. ఇక దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు దాదాపుగా రోజుకి 40 వేలకి పైగా నమోదు అవుతున్నాయి. అందులో ఎక్కువ శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయని వెల్లడించారు. కాబట్టి కేరళ రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారి పై మరింత శ్రద్ద పెట్టాలని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో కరోనా తగ్గుదల పరిస్థితులు కనబడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో, ఇక పోయిందనే అజాగ్రత్త పనికి రాదు అని తెలిపారు.
ఒకవేళ కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది అని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా మళ్లీ పెరిగే అవకాశం ఉంది. వచ్చేది పండుగలు సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెకండ్ వేవ్ కరోనా విజృంభణ ఈ రేంజ్ లో ఉండటానికి ప్రధాన కారణం..ఆ అలసత్వమే. కరోనా ఫస్ట్ వేవ్ కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత అందరూ కరోనా నియమాలని బ్రేక్ చేసి ఏ మాత్రం భయం లేకుండా యథేచ్ఛగా తిరగడం మొదలుపెట్టారు. అందుకే సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి వచ్చింది. కాబట్టి ఈసారి థర్డ్ వేవ్ కరోనా రాకుండా ఉండాలి అంటే కరోనా నియమాలు అందరూ పాటించాలి. కేంద్రం చెప్పే కరోనా నియమాలు పాటిస్తూ పేస్ మాస్కులు , శానిటైజ్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తే కరోనా మహమ్మారి ని అతి త్వరలోనే అంతం చేయచ్చు.