షాకింగ్ నిజం బయటకు.. ఆ టీకా వేసుకున్న ఆర్నెల్లకు అలా జరుగుతుందట

Update: 2021-09-07 02:54 GMT
కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు తీవ్రంగా ప్రయత్నాలు చేసి.. కరోనాకు చెక్ చెప్పే కన్నా.. దాని తీవ్రతను తగ్గించేలా చేయటం.. యాంటీ బాడీలను పెంచటం ద్వారా మనల్ని మనం రక్షించుకునేలా రూపొందించారు. దాదాపు వందకు పైగా సంస్థలు పరిశోధనలు చేయగా.. వేళ్ల మీద లెక్క పెట్టేన్ని కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్లు రూపొందించారు. ఆ జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు ఫైజర్ సంస్థ తయారు చేసిన టీకా.

ఈ టీకా మీద ఇప్పటివరకు ఎలాంటి రిమార్కు లేదు. కొందరైతే ఈ టీకా కోసం విదేశాలకు వెళ్లిన వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం షాకింగ్ గా మారటమే కాదు.. కొత్త సందేహాలకు తావిస్తోంది. కేస్ వెస్టర్న్ రిజర్వ్.. బ్రౌన్ వర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఇది తేల్చిన విషయం ఏమంటే.. ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన కొవిడ్ యాంటీబాడీలు 80 శాతం తగ్గిపోతున్నట్లుగా గుర్తించారు.

ఆసుపత్రుల్లో ఉంటున్న 120 మంది బ్లడ్ శాంపిల్స్.. 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి కూడా రక్త నమూనాల్ని సేకరించారు. వారిలో కరోనా యాంటీ బాడీల లెక్కను గుర్తించారు. వీరంతా కూడా ఫైజర్ సంస్థ టీకా తీసుకున్న వారే. అయితే.. తాజా అధ్యయనంలో టీకా తీసుకున్న ఆర్నెల్ల తర్వాత కొవిడ్ ప్రతినిరోధకాలు దాదాపుగా 80 శాతం మేర తగ్గిపోతున్నట్లు గుర్తించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ తగ్గుదల అందరిలోనూ ఒకేలా ఉండటం. నర్సింగ్ హోం నివాసాల్లో 70 శాతం మందికి కరోనా వైరస్ ను ఎదుర్కొనేంత స్థాయిలో యాంటీబాడీలు లేవని ఈ అధ్యయనాన్ని నరి్వహించిన డేవిక్ కెనడే వెల్లడించారు.మరోవైపు డెల్టా వేరియంట్ విరుచుకుపడిన వేళలో.. బూస్టర్ డోసుల అవసరం ఎంతన్న విషయం తమ అధ్యయనం స్పష్టం చేస్తుందంటున్నారు. ఒక్క ఫైజర్ టీకా మాత్రమే ఎందుకు? మిగిలిన వాటికి సంగతి కూడా ఎలా ఉందన్న విషయం మీద అధ్యయనం నిర్వహిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News