ప్రముఖ ఈ కామర్స్ సంస్థ షాప్‌క్లూస్.కామ్ వ్యవస్థాపకుల మధ్య రాజుకున్న ఎఫైర్ చిచ్చు రచ్చకెక్కింది. షాప్ క్లూస్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన సందీప్ అగర్వాల్.. తన భార్య రాధికా అగర్వాల్ (ప్రస్తుతం ఆయనతో విడిపోయింది), సంజయ్ సేథీలపై ఈ నెల తొలినాళ్లలో పరువు నష్టం కేసు దాఖలు చేసినట్లు ప్రకటించారు. వీరిద్దరు కూడా సంస్థ సహ వ్యవస్థాపకులే. ఫేస్ బుక్ లో సందీప్ పెట్టిన వరుస పోస్టింగ్ లతో ఆయన భార్య రాధికా అగర్వాల్ - సంజయ్ సేథీల మధ్య ఎఫైర్ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. సంజయ్ సేథీతో రాధికకు ఎఫైర్ ఉందని, సంస్థలో తనకున్న ఓటింగ్ అధికారాలను అక్రమంగా ఆక్రమించుకుందని ఆయన ఆరోపించారు.
గుర్గావ్ కేంద్రంగా 2011లో అగర్వాల్ దంపతులు, సంజయ్ సేథీ కలిసి షాప్ క్లూస్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వినియోగదారులకు సేవలందించేందుకు లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ మార్కెట్ విలువ 100 కోట్ల డాలర్ల పైమాటే. జీఐసీ పీటీఈ లిమిటెడ్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్ ఎల్ ఎల్ సీ, నెక్సస్ వెంచర్ పార్ట్ నర్స్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. 2013లో అమెరికాలో నమోదైన ఓ ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ అగర్వాల్.. తన అధికారాలను భార్యకు అప్పగించారు. అప్పటి నుంచి సందీప్ షాప్ క్లూస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. అయితే ఇప్పటికీ సందీప్ కు సంస్థలో మెజారిటీ వాటా ఉంది. ఆ వివాదంపై బహిరంగంగా స్పందించినందుకు క్షమాపణలు కోరుతూ సోమవారం స్టేట్ మెంట్ విడుదల చేసిన సందీప్ తరఫున పౌర సంబంధాల బృందం.. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాదని హామీ ఇచ్చింది. అందరికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే సందీప్ పలుసార్లు మోసపోయారని, అయితే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ప్రతి కామెంట్ కు ఆయన కట్టుబడి ఉన్నట్లు స్టేట్ మెంట్ పేర్కొంది. జీవిత భాగస్వామితోపాటు షాప్ క్లూస్ కూడా తనకు దూరమైంది. తన పిల్లల్ని కూడా కలవడానికి వీలుపడట్లేదు. ఈ పరిణామం ఆయనను మానసికంగా ఎంతగానో కృంగదీసింది. ఆయన ఫేస్ బుక్ తన ఆవేదనను వెల్లడించడానికి దారితీసిందని, వ్యక్తిగత వివరాలపై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించినందుకుగాను ఆయన పశ్చాతాపడుతున్నారు. అయినప్పటికీ ఆయన చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నారు అని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం షాప్ క్లూస్ కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అయిన రాధికా అగర్వాల్ ఈ విషయంపై స్పందిస్తూ.. సందీప్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన అవాస్తవిక, నిరాధార ఆరోపణలను చూసి షాక్ కు గురయ్యా అని అన్నారు. తమ సంస్థ బ్రాండ్ ను ఈ పరిణామాలు ఒకింత ఇబ్బందుల్లో పడేస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/