అసెంబ్లీ ముందు ఎస్‌ఐ సూసైడ్ .. సీఎం పేరుతో సూసైడ్ నోట్

Update: 2021-03-05 09:49 GMT
యూపీ అసెంబ్లీ వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యూపీ అసెంబ్లీ గేట్ నంబరు 7 వద్ద సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే తన తుపాకీతో తానే కాల్చుకున్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. యూపీకి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే. యూపీ అసెంబ్లీ వద్దకు వచ్చారు. అక్కడి ఏడో నెంబరు గేటు వద్ద నిలుచున్న ఆయన, తన సర్వీసు రివాల్వర్ తో తనను తాను కాల్చేసుకున్నారు. దీనితో అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన  ఘటనాస్థలం లోనే  కన్నుమూశారు. పెద్ద శబ్దం రావడంతో  అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకొని , ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను మరణించిన వైనాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్య అనంతరం ఆయన  మృతదేహం వద్ద నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం రాసిన ఓ లెటర్ ఉంది. ఆ లెటర్లో ‘నా మనసేమీ బాలేదు. నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగులు చూడండి’ అని రాశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ నవీన్ అరోరా తెలిపారు.
Tags:    

Similar News