రాంగోపాల్ వర్మ.. ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన సినిమాలు ఎంత వివాదాస్పదమో.. ఆయన ట్వీట్లు అంతకంటే వివాదాస్పదం. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సినిమాలు విడుదలవుతాయని టాక్. కాగా గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తదితర సినిమాల ద్వారా టీడీపీని దెబ్బకొట్టాడు రాంగోపాల్ వర్మ.
ఇటీవల కాలంలో టీడీపీ, జనసేనల పై వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు.. వర్మ. ఈ నేపథ్యంలో ఇటీవల గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాంగోపాల్ వర్మను విద్యార్థుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ ఆయనపై మండిపడింది. 'అడల్ట్ మూవీస్ తీసే రాంగోపాల్ వర్మను విద్యాలయానికి పిలవడమా.. ఇది నిజంగా సిగ్గుచేటు.. అసహ్యకరం. ఇలాంటి వ్యక్తిని యూనివర్సిటీకి పిలిచి వైస్ చాన్సలర్ విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?' అంటూ మండిపడింది. ఈ ట్వీట్ కు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే హ్యాష్ ట్యాగును జత చేసింది. అంతేకాకుండా వైసీపీ ఫాలోవర్ అంటూ రాంగోపాల్ వర్మను టీడీపీ పేర్కొనడం విశేషం.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రాంగోపాల్ వర్మ వంతు వచ్చింది. ఏప్రిల్ 20న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని 'సిక్కో సైకో' అంటూ వర్మ చంద్రబాబు పై వివాదాస్పద సాంగ్ ను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
'జగన్ ను సీబీఎన్ సైకో అని పిలుస్తారు.. కానీ ఆయనే ఒక పెద్ద సైకో అని తెలుసుకోలేకపోతున్నారు. అవతలివారివైపు ఒక వేలు చూపిస్తే.. నీ వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తెలియకపోవడం అదృష్టపరంగా దురదృష్టం' అంటూ వర్మ తన సొంత వాయిస్ తో ఈ సాంగ్ లో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద పాట పై టీడీపీ శ్రేణులు వర్మపై మండిపడుతున్నాయి.
'యధ్భావం తద్ భవతీ అంటే మనలో ఏ లక్షణాలు ఉన్నాయో అదే దృష్టితో అందరినీ చూడటం, వాళ్ళకి మన లక్షణాలు ఉన్నాయి అని అనుకోవడం. ఇలాంటి వ్యాధితో మీరు బాధ పడుతున్నారు. దయచేసి ఒక మంచి డాక్టర్ ను సంప్రదించండి. మీరు రోజు రోజు సైకో స్థాయిని దాటి పోతున్నారు వర్మ గారు' ఒక నెటిజన్ రాంగోపాల్ వర్మకు ఘాటు రిప్లై ఇచ్చాడు.