మొన్న ఇద్దరు.. నేడు పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కర్ణాటక సంకీర్ణ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి జలక్ ఇచ్చారు. దీంతో కుమారస్వామి సర్కారు తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రభుత్వం కూలిపోతుందన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆపరేషన్ కమల చేపట్టిన బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక.. కాంగ్రెస్ కే చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య హస్తం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కుమారస్వామిని సీఎం చేయడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వారిలో మాజీ సీఎం సిద్ధరామయ్య ఒకరు. రాజీనామా చేసిన ఆ 12మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు బాగా క్లోజ్ అంట. ఆయన సూచనల మేరకే వారు రాజీనామా చేశారన్న ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్యకు సీఎం పీఠం ఇస్తేనే తాము రాజీనామా ఉపసంహరణకు సిద్దమని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ప్రకటించడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జేడీఎస్ అధినేత దేవెగౌడతో సిద్ధరామయ్యకు శతృత్వం ఉంది. అందుకే ఆది నుంచి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీతోపాటు సిద్ధరామయ్య కూడా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ముంబై తరలి రిసార్ట్ లో క్యాంపు రాజకీయం చేస్తున్న రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య - కాంగ్రెస్ కర్ణాటక ఇన్ చార్జి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. వీరు సిద్ధరామయ్యను సీఎం చేయాలని కోరారు. అలా చేస్తేనే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సిద్ధరామయ్య స్పందించారు. ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాలని సీఎం కుమారస్వామి - డిప్యూటీ సీఎం పరమేశ్వర్ చెప్పారు. అయితే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇది సీఎం - డిప్యూటీసీఎం చేయాల్సిన పని. నేనేం చేయలేను. పరిస్థితి చేయిదాటిపోయిందని.. వారికి అన్యాయం జరిగిందని.. వారికి కేబినెట్ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడికి దిగజారేది కాదని తెలిపారు.
దీంతో సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే సంకేతాలను ఇచ్చినట్టైంది. సీఎందే బాధ్యత అని సిద్ధరామయ్య తప్పించుకోవడంతో ఇప్పుడు కర్ణాటక సర్కారు అపంశయ్యపై ఉంది.