ఏమాటకామాట చెప్పుకోవాలంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంలో మోడీపాత్ర చాలా కీలకమనే చెపాలి. మోడీకి - చండ్రబాబుకి చాలా సాన్నిహిత్యం ఉందని.. వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో రాష్ట్రానికి భారీస్థాయిలో కేంద్రంనుంచి మేలులు జరుగుతాయని ప్రచారం చేయడం, ఆ ప్రచారాలను వాగ్ధానాలను ప్రజలు నమ్మడం తెలిసిందే! అయితే మంచిచేసినప్పుడు మోడీ మావాడని, అందులో టిడీపీ భాగస్వామ్యం ఉందని చెప్పుకునే టీడీపీ నేతలు.. నోట్ల రద్దు విషయంలో సమర్ధించాలో వ్యతిరేకించాలో తెలియని సందిగ్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వరకూ వెళ్లే వార్తల్లో టీడీపీ సమర్ధిస్తున్నట్లు... గ్రామస్థాయి - జిల్లా స్థాయి వార్తల్లో నోట్లరద్దు విధానం తప్పనే సంకేతాలిస్తూ అలా నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే!! ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా చంద్రబాబు మాటలపై బీజేపీ కలుపుకుపోతుంది!
నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు - మోడీకి అక్టోబర్ 12న లేఖ రాయడం - నవంబర్ 8వ తేదీన ఈ నిర్ణయం వెలువడినప్పుడు.. చంద్రబాబు సలహా మేరకే నోట్ల రద్దు జరిగిందని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారనేది తెలిసిన విషయమే. అయితే తాజాగా ఏపీ సీఎం స్పందిస్తూ... నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదని పార్టీ సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే! అయితే ఈ విషయంలో టీడీపీ సేఫ్ గేం ఆడుతుందని, ఈ సమస్య ఫలితం నుంచి మెళ్లగా జారుకుంటుందని భావించారో ఏమో కానీ... ఈ విషయంలో బాబుని కలుపుకుపోవాలనే బీజేపీ నిర్ణయించినట్లుగా కనిపిస్తుంది. దానికి తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం!
నోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబుతో పాటు టీడీపీ గట్టిగా సమర్థించిందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెబుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయం క్రెడిట్ ను ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ తీసుకుందని, అలాగే చంద్రబాబు డిజిటల్ ఎకానమీ కమిటీకి కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నారని గుర్తుచేసిన సిద్ధార్థనాథ్ సింగ్... చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరికి తేడా ఏమీ లేదని, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో ఇదే కోరుకున్నారని చెప్పిన ఆయన... పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/