‘ట్వీట్ రాయుడి’ కి అవగాహన తక్కువట

Update: 2016-12-20 13:17 GMT
వరుస ట్వీట్స్ తో బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ విమర్శల కంటే కూడా సైద్దాంతిక అంశాలతో పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తూ ఇరుకున పెడుతున్న పవన్ వైఖరితో తమ ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ అవుతుందన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ట్వీట్లతో గర్జిస్తున్న ట్వీట్ రాయుడిపై బీజేపీ నేత సిదార్థనాథ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. పవన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మండి పడ్డ ఆయన.. గోవధపై ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఐదు అంశాలపై సమాధానం చెప్పాలని గతంలోనే తాము కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా తమపై విమర్శలు చేయటాన్ని తాము స్వాగతిస్తామని.. అదే సమయంలో సీరియస్ రాజకీయాల్లో అడుగుపెట్టాలని పవన్ భావిస్తే.. విషయాల మీద లోతుగా అధ్యయనం చేశాక విమర్శిస్తే బాగుంటుందన్నారు. పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో ట్విట్టర్లో ఫాలో అయ్యేది లేదని సిదార్థనాథ్ సింగ్ స్పష్టం చేయటం విశేషం.

గోవధ.. ప్రత్యేక ప్యాకేజీల మీద మాట్లాడుతున్న కమలనాథులు.. పవన్ లేవనెత్తిన అన్ని అంశాలపై ఎందుకు రియాక్ట్ కారన్నది ఒక ప్రశ్న. మిత్రుడిగా వెంట తిరిగినప్పుడు పవన్ మాటల్లో కనిపించని అవగాహనారాహిత్యం.. విమర్శించినప్పుడు మాత్రం కనిపించటమే అసలుసిసలు రాజకీయమంటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News