కారులో వెళుతూ సిద్దార్థ కాల్స్ చేసిందెవరికి?

Update: 2019-08-01 06:11 GMT
దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన కేఫ్ కాఫీడే సీఎండీ వీజీ సిద్దార్థ ఆత్మహత్యకు ముందు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు కొన్ని బయటకు వచ్చాయి. కారులో ప్రయాణిస్తూ.. నేత్రావతి నది వద్దకు వచ్చినంతనే కారు ఆపమని చెప్పి.. ఫోన్ మాట్లాడుతూ ముందుకెళ్లిన సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆత్మహత్యకు ముందు కారులో ఫోన్లు చేసిన సందర్భంగా ఆయన నోటి వెంట అదే పనిగా సారీలు వచ్చినట్లుగా కారు డ్రైవర్ వెల్లడించారు. ఇంట్లో నుంచి కారులో బయలుదేరిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేను కాల్స్ వరకూ చేసినట్లు కారు డ్రైవర్ వెల్లడించారు.  ప్రతి ఫోన్ కాల్ లోనూ అదే పనిగా సారీలు చెప్పటం గమనించినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పాడు. 

సిద్దార్థ అంతలా ఎందుకు క్షమాపణలు చెప్పిందెవరికి?  ఏ కారణంగా సారీలు చెప్పారన్న విషయం తేలాల్సి ఉంది. ఆయన చేసిన 10-15 ఫోన్ కాల్స్ ఒకరికే చేశారా?  వేర్వేరు వ్యక్తులకు చేశారా?  అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు సిద్దార్థలో తమకు ఎలాంటి తేడా కనిపించలేదని ఆయన సతీమణి వెల్లడించారు. రోజూ మాదిరే వెళ్లారని.. ఊరికి వెళ్లి వస్తానని చెప్పారని.. - ప్రకృతి ప్రేమికుడైన సిద్ధార్థకు అలా వెళ్లటం అలవాటు కావటంతో తమకు ఎలాంటి అనుమానం రాలేదన్నారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో సిద్దార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Tags:    

Similar News