అమెరికాలోని సిక్కు విద్యార్థిపై విద్వేష దాడి

Update: 2017-11-04 18:07 GMT
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట ఒక సిక్కు వ్యక్తిని కాల్చేశారు. మీ దేశం పో అంటూ ఆయన్ను కాల్చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా ఒక స్నాప్ చాట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక 14 ఏళ్ల సిక్కు విద్యార్థిని మరో విద్యార్థి దారుణంగా కొడుతున్న వీడియో అది. జాతి వివక్షతో తమ అబ్బాయిపై దాడి చేశారాంటూ ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా చేశారు.

అయితే... స్కూలు టీచర్లు మాత్రం పిల్లాడి తల్లిదండ్రుల ఆరోపణను కొట్టిపారేస్తున్నారు. అది జాతివివక్షతో కూడుకున్న నేరం కాదని.. అందులో అలాంటి కోణమే లేదని అంటున్నారు. క్లాసు రూంలో జరిగిన ఓ గొడవకు కొనసాగింపుగా ఇది చోటుచేసుకుందని వారు చెప్తున్నారు. దాడి చేసినవారిని తగిన విధంగా శిక్షిస్తామని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది.

అమెరికాతో పాటు పలు ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి వివక్ష ఎక్కువవుతోంది. జాతీయవాద అతివాదం కారణంగా ఇలాంటి పెడదోరణి ప్రపంచమంతా పాకుతోంది. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ర్టేలియా వంటి చోట్ల ఇది ఎక్కువగా ఉంది. అమెరికాలో జాతి వివక్ష కొత్తేమీ కాకున్నా భారతీయులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రం తక్కువనే చెప్పాలి. ఎక్కడో ఒకటీ అరా ఉండేవి కానీ ఈ స్థాయిలో ముందెన్నడూ లేదు. ట్రంప్ అధ్యక్ష ఎణ్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ఇలాంటివి ఎక్కువయ్యాయి.
Tags:    

Similar News