తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ లో జయరాంను హత్య చేసిన రాకేశ్ రెడ్డి... ఆయన డెడ్ బాడీని కృష్ణా జిల్లాలో పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తును చేపట్టిన కృష్ణా జిల్లా పోలీసులు రాకేశ్ రెడ్డిని నిందితుడిగా తేల్చేసి చేతులు దులుపుకున్నాయి. అయితే జయరాం సతీమణి ఫిర్యాదుతో ఈ కేసును తిరగదోడిన తెలంగాణ పోలీసులు ఇందులోని ఆసక్తికర కోణాలను వెలికి తీస్తున్నారు.
ఈ క్రమంలో జయరాం తన మేనకోడలు శిఖా చౌదరితో శారీకర సంబంధం పెట్టుకున్నారని, శిఖాతో పాటు ఆమె సోదరితోనే ఆయన ఇదే తరహా సంబంధాన్ని నెరపారని వార్తలు వచ్చాయి. ఈ విషయాలను స్వయంగా శిఖా చైదరే బయటపెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఇప్పుడు శిఖా చెబుతున్నారు. ఇప్పటిదాకా దీనిపై మాట్లాడని శిఖా.. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తండ్రి లాంటి మామయ్యతో తాను అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటానని కూడా శిఖా ఆవేదన వ్యక్తం చేసింది. తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని.. జయరామ్ తనకు తండ్రిలాంటి వారని శిఖా కొట్టి పారేసింది.
తాను ఈ కేసులో నిందితురాలిని కాదని బాధితురాలిని అని వివరించింది. తనను అనవసరంగా ఈ రొంపిలోకి దించారని ఆమె ఆరోపించింది. జయరామ్‌తో తనకు, తన చెల్లికి సంబంధాలున్నాయని తాను ఒప్పుకున్నట్లు చాలా తప్పుగా వార్తలు వచ్చాయని చెప్పిన శిఖా... ఇలాంటి వార్తలతో కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. జయరాం వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అని తాను చెప్పలేనని, అయితే తనకు ఆయనతో సంబంధం అంటగట్టిన వైనం చూస్తుంటే.. చాలా బాధేసిందని కూడా ఆమె వాపోయింది. ఈ తరహా వార్తలతో తన కుటుంబం చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఈ షాక్ నుంచి తేరుకోవడానికి తమకు చాలా సమయమే పడుతుందని కూడా చెప్పుకొచ్చింది.