మోడీ మాదిరే ఆయ‌న కాబినెట్ లో 18 మంది ఉన్నార‌ట‌!

Update: 2019-06-09 14:30 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి.. ఆయ‌న నీడ‌గా కొంద‌రు.. ఆయ‌న ఆత్మ‌గా మ‌రికొంద‌రు అభివ‌ర్ణించే కేంద్ర‌మంత్రి అమిత్ షాకు చాలానే పోలిక‌లు ఉంటాయ‌ని చెబుతారు. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. ఇరువురి మ‌ధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సంబంధాలు అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డ‌ట‌మే త‌ప్పించి బ‌ల‌హీనం కావ‌టం అన్న‌ది క‌నిపించ‌దు.

పార్టీ శ్రేణుల‌తో అనుసంధానంతో పాటు.. విజ‌య‌కాంక్ష‌.. పార్టీని తిరుగులేని రీతిలో త‌యారు చేయ‌టంతో పాటు.. ప్ర‌త్య‌ర్థుల్ని బోల్తా కొట్టించ‌టంలో చూపించే తెంప‌రిత‌నం ఒకేలా ఉంటుందంటారు. ఈ ఇద్ద‌రికి సంబంధించిన మ‌రో కామ‌న్ అంశం.. వారి గ‌డ్డం. మోడీ గ‌డ్డం చ‌క్క‌గా షేప్ చేసిన‌ట్లుగా ఉంటే.. అమిత్ షా గ‌డ్డం మాత్రం అందుకు భిన్నంగా ఉండ‌టం తెలిసిందే.

తాజాగా మోడీ మంత్రి వ‌ర్గానికి చెందిన దాదాపు 18 మంది మంత్రులు గ‌డ్డం బాస్ లే అని చెబుతున్నారు. మోడీషాల‌తో స్ఫూర్తి పొందారా?  లేక స్వ‌భావ‌రీత్యా గ‌డ్డం పెంచే అల‌వాటో కానీ.. మోడీ కేబినెట్ లో గ‌డ్డం పెంచే మంత్రులు ఏకంగా 18 మంది ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

మోడీ కాబినెట్ లో మొత్తం 58 మంది మంత్రులు ఉంటే.. వారిలో 18 మంది.. సుమారుగా 30 శాతానికి పైనే మంత్రులు గ‌డ్డంతో ద‌ర్శ‌న‌మివ్వ‌టం క‌నిపిస్తుంది. కేంద్ర మంత్రివ‌ర్గంలో ఇంత పెద్ద ఎత్తున గ‌డ్డంతో ఉండ‌టం ఇదే తొలిసారిగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది యాదృశ్చిక‌మే త‌ప్పించి.. ప్ర‌త్యేక కార‌ణం లేదంటున్నారు.

కేబినెట్ మంత్రుల్లో గ‌డ్డం మంత్రుల్నిచూస్తే..

+  ఎస్‌.జయ్‌శంకర్ (విదేశీ వ్యవహారాల మంత్రి)

+  రాంవిలాస్‌ పాసవాన్ (వినియోగదారుల వ్యవహారాల మంత్రి)

+  ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్  (ప‌ర్యాట‌క మంత్రి)

+  ముక్త‌ర్ అబ్బాస్ నఖ్వీ (మైనార్టీ శాఖామంత్రి)

+  గిరిరాజ్ సింగ్  (ప‌శుసంవ‌ర్థ‌క శాఖా మంత్రి)

+  సంతోష్ గంగ్వార్  (కార్మిక మంత్రి, స్వ‌తంత్ర‌శాఖ‌)

+  ప్రహ్లాద్‌ పటేల్ (సాంస్కృతిక,పర్యాటకశాఖ మంత్రి)

+  హ‌ర్ దీప్ పూరీ (విమాన‌యాన శాఖా మంత్రి)

స‌హాయ మంత్రుల్లో..

+  జి.కిషన్‌రెడ్డి

+  అశ్వనీ చౌబె

+   కృష్ణపాల్‌ గుర్జర్‌

+  పురుషోత్తం రూపాలా

+   రాందాస్‌ అథవాలే

+   బాబుల్‌ సుప్రియో

+   అనురాగ్‌ ఠాకుర్‌

+   ప్రతాప్‌ చంద్ర షడంగీ


Tags:    

Similar News