తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా మరో క్రేజీ ఎన్నికల పోరు కొనసాగనుంది. తెలంగాణలోని పరిస్థితులను చూస్తే బలమైన ప్రతిపక్షం ఏదీ లేదనేది అందరూ చెప్తున్న మాట. విపక్షాలన్నీ తమ తమ ఎజెండాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారి అనైక్యతతో కేసీఆర్ రిలాక్స్ అయిపోయారని పలువురి విశ్లేషణ. అయితే ఆ రిలాక్స్ నుంచి అలర్ట్ అయ్యే పరిస్థితి తెరమీదకువచ్చింది. ఇప్పుడు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు - 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఐక్యతా రాగాన్ని ప్రదర్శిస్తున్నాయి.
పేరుకు సింగరేణి ఎన్నికలు అయినప్పటికీ ఈ ఓటర్లు దాదాపుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకం. ఈ నేపథ్యంలో ఇక్కడి గెలుపు ఓటములు సార్వత్రిక ఎన్నికలను మూడ్ ను తెలియజెప్పడం ఖాయం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాలనే లక్ష్యంతో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి మిగతా పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్ టియుసి) - టీడీపీ అనుబంధమైన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ (టిఎన్ టియుసి)లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చాయి. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు - గండ్ర వెంకటరమణా రెడ్డి - ఐఎన్ టియుసి నాయకులు ప్రసాద్ - బిఎన్ రెడ్డి టీఆర్ ఎస్ అనుబంధ సంఘానికి వ్యతిరేకంగా సీపీఐ సంఘానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే సింగరేణి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిజిబికెఎస్) - భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) - సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్ (సిఐటియు) - హెచ్ ఎంఎస్ లు ఒంటరిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అక్టోబర్ 5న జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొత్తంగా విపక్షాలన్నీ ఒకవైపు - గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ ఎస్ ఒకవైపు అన్నట్లుగా ఈ మినీ సంగ్రామం ప్రారంభమైంది.