రచయిత, గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల ఉదంతంలో కలకలం రేకెత్తించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గజల్ శ్రీనివాస్ మసాజ్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అంతటా ఈ వార్త కలకలం రేగుతుంది. ఆమె ఆవేదన ప్రకారం లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయిన గజల్ బాగోతాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా బాధిత యువతి మీడియాతో మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ వికృత చేష్టల గురించి వివరించి చెప్పారు. గజల్ శ్రీనివాస్ నడుపుతున్న వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్నానని తెలిపారు. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు - నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు. గజల్ శ్రీనివాస్ సమాజానికి కనిపించేది ఓ వ్యక్తి అయితే.. ఆఫీసులో మరో వ్యక్తిలా ఉంటాడని వెల్లడించింది. తన కోరిక తీర్చాలని తనను గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడని మీడియాతో ఆమె వాపోయింది. గజల్ శ్రీనివాస్ గురించి తాను ఎవరికీ చెప్పినా నమ్మరని, అందుకే సాక్ష్యాలన్నీ సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
చెప్పిన పని చేయకపోతే తనకు బయట ఏ అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించేవాడని బాధితురాలు వాపోయింది. గజల్ శ్రీనివాస్ సమాజానికి కనిపించేది ఓ వ్యక్తి అయితే.. ఆఫీసులో మరో వ్యక్తిలా ఉంటాడని తెలిపారు. ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా ఉండేవాడని ఆమె తెలిపింది. గజల్ శ్రీనివాస్ తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని వేధించాడని తెలిపారు. పనిమనిషి పార్వతి కూడా తనను ఇబ్బంది పెట్టిందని, గజల్‌తో సన్నిహితంగా ఉండాలని డిమాండ్ చేసేదని చెప్పారు. ‘నేను గజల్ శ్రీనివాస్‌తో సెక్స్‌లో పాల్గొంటాను. నీవు కూడా అలాగే చేయ్. నాక్కూడా ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. అయినా నా భర్తకు తెలియకుండా చేస్తున్నా' అని పనిమనిషి తనను బలవంతపెట్టిందని బాధితురాలు తెలిపారు.
తనతో మసాజ్ చేయించుకోవడం బలవంతంగా హగ్ చేసుకోవడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటివి చేశాడని వాపోయింది.అతడ్ని తాను చెప్పుతో కొట్టాలన్న కోపంగా ఉందని ఆమె చెప్పారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గజల్ శ్రీనివాస్ పీఏ పవన్ కుమార్, ఇతర ఆఫీసు సిబ్బందికి కూడా వేధింపుల విషయం చెప్పానని, వారు కూడా ఏం చేయలేమని చెప్పారని బాధితురాలు తెలిపారు. శ్రీనివాస్ భార్యకు ఈ విషయం చెపితే నమ్మదని...పనిమనిషి వేధిస్తున్నట్లుగా చెప్పినట్లు ఆమె వివరించారు. గతంలో ఇతని బారిన ఎంతమంది పడ్డారో తెలియదు గానీ, భవిష్యత్‌లో ఎవరూ కూడా బాధితులు కాకూడదనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు.వెంటనే స్పందించిన పోలీసులు గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. అయితే, పోలీసులు అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఇదిలాఉండగా...గజల్ బాధితురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్టులో పంజగుట్ట పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా గజల్ ఆఫీస్‌లో బెడ్‌రూం ఉందని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పలువురి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు .. బాధితురాలికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ ప్రలోభాలకు గురిచేశారని అన్నారు.
కాగా, లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈ నెల 12 వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రేడియో జాకీ ఫిర్యాదుతో ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే గజల్ శ్రీనివాస్‌ను రెండు వారాలపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిపిన నాంపల్లి కోర్ట్ గజల్ శ్రీనివాస్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.