గాయకుడు కేకే ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని మరణానికి కారణమేమిటనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేకే చివరిగా ప్రదర్శించిన ఆడిటోరియంలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని.. కెపాసిటీకి మించి ఎక్కువమంది అభిమానులను నింపి ఊపిరాడకుండా చేయడం వల్లే మరణించాడనే ప్రచారం ఉంది. అతని మరణం 'అసహజమైనది'గా కేసు కూడా నమోదు చేయబడింది. కానీ ఇప్పుడు పోస్ట్‌మార్టం నివేదికలు అన్నింటినీ తోసిపుచ్చాయి.
కేకే కోల్‌కతాలో తన ప్రదర్శన తర్వాత అసౌకర్యానికి గురయ్యాడు. హోటల్ కు వెళ్లగానే కుప్పకూలాడు. అనంతరం సహాయకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కేకే చనిపోయినట్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారీ కార్డియాక్ అరెస్ట్ ఉందని.. ఇతడు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి -తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడని తేలింది.
కేకే గుండెలోని ఎడమ ప్రధాన కరోనరీ ఆర్టరీలో పెద్ద అడ్డంకులు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఇతర ధమనులు మరియు ఉప ధమనులలో చిన్న అడ్డంకులు ఉన్నాయని ఒక వైద్య అభ్యాసకుడు నివేదించారు. లైవ్ షో సమయంలో అధిక ఉత్సాహం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి గుండె ఆగిపోయి అతని ప్రాణాలను బలిగొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వైద్యులు సకాలంలో సీపీఆర్ అందజేస్తే కేకే ప్రాణాలతో బయటపడేవారని తెలిపారు.
కేకే అంత్యక్రియలు ముగిశాయి. దివంగత గాయకుడికి ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అతనికి భావోద్వేగ వీడ్కోలు పలికారు.
దక్షిణ కొల్ కతాలోని నజ్రుల్ మంచ్ ఆడిటోరియంలో సోమవారం రాత్రి కేకే ప్రదర్శన ఇచ్చాడు. ఈ స్టేడియంలో 2500 నుంచి 3000 వరకు ప్రేక్షకులు ఒకేసారి వీక్షించవచ్చు. అయితే కేకే షో చూడడానికి ఆ రోజు 7 వేలకు పైగా సంగీత ప్రియులు వచ్చారని సమాచారం. దీంతో ఆడిటోరియం కిక్కిరిపోయింది. ఇదే సమయంలో ఆడిటోరియం ఏసీ పనియేయకపోవడంతో కాస్త కూడా గాలి రాని పరిస్థితి ఏర్పడింది. జనంతో నిండిన ఈ ఆడిటోరియంలో ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని కొందరు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు.
ఈ పరిస్థితుల్లోనూ అభిమానులను అలరించేందుకు కేకే సాంగ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన డీ హైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే సాంగ్ మధ్యలో అతడు టవల్ తో తుడుచుకుంటూ కనిపించాడు. అధికంగా ఉక్కపోత రావడం కేకే కు మరింత కష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఊపిరాడలేదని కొందరు అంటున్నారు. కాసేపు నడిచిన ఏసి ఆ తరువాత స్విచ్ఛాప్ అయింది. దీంతో కేకేకు శ్వాస ఆడకపోవడంతో హోటల్ కు తనకు బాగాలేదని వెళ్లాడు. అక్కడే కింద పడిపోయాడు.ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.