అత్యంత సంచలనం రేపిన హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం మొదట్లో ఎంత చర్చనీయాంశంగా నిలిచిందో, ఆ తర్వాత అంత అనాసక్తిగా తయారు అయ్యింది. ఈ వ్యవహారంలో మొదట్లో పోలీసుల తీరు, తెలంగాణ ప్రభుత్వం తీరును సామాన్యులు ఎంతగా మెచ్చుకున్నారో.. ఆ తర్వాత ఈ కేసు ఏం అయ్యిందో అర్థం కాక, ఆ వ్యవహారాన్నే మరిచిపోయారు. ఇప్పుడు అదే వ్యవహారంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన సిట్ చార్జిషీట్ ను దాఖలు చేసింది. నాలుగు కేసులకు సంబంధించి చార్జిషీట్ దాఖలు అయినట్టుగా తెలుస్తోంది. ఈ చార్జిషీట్ ద్వారా అర్థం అవుతున్నది ఏమిటంటే..ఈ వ్యవహారం పూర్తిగా నీరుగారిపోయింది అనేది!
డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తీరు, అందులో ప్రముఖులకు ఉన్న ప్రమేయం.. అప్పట్లో సంచలనం. కొంతమంది వ్యక్తుల పేర్లను తెలంగాణ పోలీసులు డైరెక్టుగా బయట పెట్టడంతో ఆ కేసు మరింత సంచలనం అయ్యింది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి జాబితాలో సినిమా వాళ్లు ఉండటంతో ఇది అన్ని వర్గాల వారి దృష్టినీ ఆకర్షించింది. పాపులర్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, మూవీ టెక్నీషియన్లు డ్రగ్స్ వాడిన వారి జాబితాలో ఉన్నారని పోలీసులు అప్పట్లో ధ్రువీకరించారు.
అలాగే వారితో పాటు ఇద్దరు డ్రగ్స్ సప్లయర్స్ నుంచి మాదక ద్రవ్యాలను పొందిన అరవైమంది జాబితా పోలీసుల చేతికి వచ్చింది! అయితే ఆ జాబితా విషయంలోనే అప్పుడు పెద్ద దుమారం రేగింది. కొంతమంది పేర్లను పోలీసులు బయటపెట్టలేదు అనే విమర్శ వినిపించింది!
కొందరు ప్రముఖ హీరోలు కూడా డ్రగ్స్ వినియోగదారులే అని, వారి పేర్లను పోలీసులు బయట పెట్టడం లేదని ఆరోపణలు వచ్చాయి. కేవలం పెద్దగా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని వారి పేర్లనే బయట పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అంతే తాతలు, తండ్రులకు స్టూడియోలు ఉంటే, వారు కూడా సినీ సెలబ్రిటీలు అయితే..డ్రగ్స్ వాడుతున్నా వారి పేర్లు బయటకు రాలేదనే ఆరోపణలు వచ్చాయి.
కొంతమంది పేర్లను అయితే వెల్లడించారు. వారిని ఒక్కొక్కరిగా విచారణకు పిలిచారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే ఎక్సైజ్ సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లో ఆ శాంపిల్స్ ప్రస్తావనే లేకపోవడం విశేషం! మొత్తం అరవై మంది పేర్లను ఆ జాబితాలో ఉంచారు. కేవలం విచారించిన వారి జాబితా అది.
ఇంతకూ వారు డ్రగ్స్ వాడినట్టా - వాడనట్లా? అనే అంశాలకు కూడా సూటిగా సమాధానం లేదు. అందుకు సమాధానం ఇవ్వాలంటే సదరు వ్యక్తులు విచారణ సమయంలో ఏం చెప్పారో పేర్కొనాలి - వారి స్టేట్ మెంట్సే కాకుండా.. వారి నుంచి సేకరించిన శాంపిల్స్ నుంచి ఏం తెలుస్తోందో చెప్పాలి! ఈ అంశాల గురించి పేర్కొనలేదు.
అప్పట్లో విచారణకు హాజరైన వారిలో కొందరు డ్రగ్స్ సప్లై కూడా చేశారని - తమకు తెలిసిన వారికి ఇచ్చినట్టుగా కథనాలు వచ్చాయి. వాడటమే నేరం - సప్లై చేయడం అంటే అంతకు మించిన నేరం. ఆ అంశాల గురించి చార్జిషీట్లో వివరించనే లేదు!
వారు బాధితులే అయితే వా విషయాన్ని పేర్కొనడంలో తప్పు లేదు. కానీ అసలు వాస్తవాలు బయటకు వచ్చిన దాఖలాలు మాత్రం కనపడటం లేదు. ఇది యావత్ హైదరాబాద్ ఇమేజ్ కు సంబంధించిన అంశం. డ్రగ్స్ భూతం పట్టిందంటే.. దాన్ని వదిలించడం ఎంత కష్టమో పంజాబ్ వంటి రాష్ట్రాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ఈ విషయంలో ప్రభుత్వం - పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.