పెట్రో ఇన్‌కం సూప‌ర్‌.. రోడ్లు మాత్రం బేజార్‌!

Update: 2021-08-30 11:30 GMT
ఏపీలో ఏ మూల‌కు వెళ్లినా.. అన్ని ర‌హ‌దారులు భారీ ఎత్తున గుంత‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ప్ర‌ధా న ర‌హ‌దారుల నుంచి ఓ మోస్త‌రు దారుల వ‌ర‌కు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా కీల‌క‌మైన రోడ్ల‌యితే.. ఎప్పుడు యాక్సిడెంట్లు జ‌రుగుతాయా? అన్న విధంగా పూర్తిగా పాడైపోయాయి. చిన్న పాటి చినుకు ప‌డితే.. చాలు.. నీటితో నిండిపోయి.. ర‌హ‌దారులు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. చిన్న‌పాటి రోడ్ల‌ను ప‌క్క‌న పెట్టినా.. మిగిలిన ర‌హ‌దారుల‌నైనా బాగు చేయాలి క‌దా?   ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు.. రోడ్ల‌ను స‌రిచేసి.. ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాలి క‌దా? అనేది ప్ర‌శ్న‌.

అయితే.. దీనిపై ఎవ‌రూ నోరు విప్ప‌డం లేదు. ముఖ్యంగా రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ అస‌లు ఎక్క‌డా ప‌ర్య‌టించ‌డం లేదు. పేషికి కూడా రావ‌డం లేదు. కేవ‌లం హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌కు మాత్ర‌క‌మే ఆయ‌న ప‌రిమిత‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అస‌లు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించే నాయ‌కులు.. కూడా వైసీపీలోక‌నిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ప్ర‌భుత్వానికి ఆదాయం లేదా..? అంటే.. భారీగానే వ‌స్తోంది. అంతేకాదు.. రోడ్ల కోసం నిత్యం ప్ర‌జ‌ల నుంచి వ‌సూళ్లు కూడా చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌భుత్వం ర‌హ‌దారి సెస్సు రూపంలో ప్ర‌జ‌ల నుంచి నిత్యం కోట్ల రూపాయ‌ల సొమ్మును తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు నిత్యం కొనుగోలు చేసే పెట్రోల్‌, డీజిల్ పై ప్ర‌తి లీట‌రుకు రూ.1 చొప్పున‌.. ర‌హ‌దారి నిర్వ‌హ‌ణ సెస్సును వ‌సూలు చేస్తున్నారు.  ఇదే రోజుల‌కు.. కొన్ని కోట్ల రూపాయ‌లు ఉంటుంది. దీని నుంచి ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, బాగుజేత‌ల‌కు నిధులు వినియోగించే అవ‌కాశం ప్ర‌భుత్వానికి ఉంది. అయిన‌ప్ప‌టికీ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


పెట్రోల్‌పై స‌ర్కారీ ఆదాయం

 +  ఒక లీట‌రు పెట్రోల్‌పై 28.49 రూపాయ‌లు వ్యాట్ వ‌స్తోంది.
 + అదేవిధంగా అభివృద్ధి సెస్ పేరిట మ‌రో రూ.4 వ‌సూలు చేస్తున్నారు.
 +  ప్ర‌తి లీట‌రు పెట్రోల్ ధ‌రలో రూ.1 ర‌హ‌దారి సెస్సును తీసుకుంటున్నారు.


డీజిల్‌పై ప్ర‌భుత్వ రాబ‌డి

 +  ఒక లీట‌రు డీజిల్‌పై 21.78 రూపాయ‌లు వ్యాట్ వ‌స్తోంది.
 + అదేవిధంగా అభివృద్ధి సెస్ పేరిట మ‌రో రూ.4 వ‌సూలు చేస్తున్నారు.
 +  ప్ర‌తి లీట‌రు పెట్రోల్ ధ‌రలో రూ.1 ర‌హ‌దారి సెస్సును తీసుకుంటున్నారు.
Tags:    

Similar News