అమెరికాలో 364 మంది అరెస్ట్‌..అందులో మ‌నోళ్లు?

Update: 2018-09-02 05:26 GMT
అమెరికాలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. వీసా నిబంధనలు - నేరాలకు పాల్పడటం - వలస నిబంధలను ఉల్లంఘించిన వారిపై అమెరికా వేటు వేసింది. అమెరికాలో నేరాలకు పాల్పడుతున్న - ఆ దేశ వలస విధాన చట్టాలను ఉల్లంఘించిన ఆరుగురు భారతీయులతో సహా 364 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులపాటు అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో దాడులు చేపట్టిన పోలీసులు భారీ సంఖ్యలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో భారత్‌ తో సహా 25 దేశాలకు చెందిన వారు ఉన్నారు. నిందితుల్లో 236 మంది మెక్సికోకు చెందిన వాళ్లు కాగా, 16 మంది మహిళలు ఉన్నారు.

364 మందిలో 187 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.మహిళలపై దాడి - చిన్నారులను హింసించడం - చిన్నపిలల్లపై నిర్లక్ష్యం - గృహహింస మత్తు పదార్థాల రవాణా తదితర కేసుల విషయంలో 187మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టుల సంద‌ర్భంగా పోలీసులు మాట్లాడుతూ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన 25 ఏళ్ల‌ భారతీయుడిని షికాగోలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఎక్కువ మంది మత్తు పదార్థాల అక్రమ రవాణా - హత్యా ప్రయత్నాలకు పాల్పడటం, దాడి, గృహహింస తదితర నేరాల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News