లాక్ డౌన్ : మద్యం కోసం ఆరుగురు ఆత్మహత్య...సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం !

Update: 2020-03-30 07:00 GMT
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాప్స్ ని కూడా మూసేసారు. దీనితో మద్యం ప్రియుల కష్టాలు వర్ణనాతీతం. మద్యం దొరకక పోవడంతో - తట్టుకోలేక ఆరుగురు ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలో శని - ఆదివారాల్లో నలుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా - కేరళలో ఇద్దరు వ్యక్తులు మద్యం దొరకలేదు అని   బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజు తాగే అలవాటు ఉన్న వారు ..ఒక్కసారిగా మద్యానికి దూరం కావడంతో మానసిక వేదనకు గురి అవుతున్నారు. మరికొందరు మాత్రం బార్‌ షాపులపై దాడులకు పాల్పడుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఆదివారం నుంచి వైన్‌ షాపులను తెరుస్తారంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ..ఏదేమైనా కూడా వైన్స్ ని తెరచే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. ఇకపోతే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో మద్యం కొనుగోలు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.  అబ్బా.. ఎంత మంచి అవకాశం, ఇప్పటికే  చాలా రోజులు అయిపోయాయి - నోరంతా ఏదోలా ఉంది..ఛలో వైన్ షాప్స్ అని అనుకుంటున్నారు. అయితే , ఈ అవకాశం తెలంగాణ - ఏపీలో ఉన్నవారికి  కాదు. కేరళ రాష్ట్రంలో ఉన్నవారికి మాత్రమే.

మద్యం దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో కేరళ ప్రభుత్వం 2020 - మార్చి 30వ తేదీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ప్రిస్కిప్సన్ తో మద్యం అందించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి ఎవరైనా కూడా మందు తాగకపోతే - చనిపోతాడు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే , ఆ సర్టిఫికెట్ చూపించి మద్యం కొనుగోలు చేయవచ్చు. అలాగే , మద్యాన్ని పూర్తిగా మానేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే శస్త్ర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. 
Tags:    

Similar News