ట్రంప్ పై పోరాటంలో ఆ అమ్మాయి సూప‌ర్‌

Update: 2017-01-25 07:16 GMT
అమెరికా కొత్త‌ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పాప్‌ సింగర్ మడోన్నా వంటి ప్రముఖులతోపాటు అనేక మంది వేదికలపై తమ అభిప్రాయలు వెలిబుచ్చారు. ఇందులో సోఫీక్రూజ్ అనే ఆరేళ్ల‌ చిన్నారి నోటి నుంచి వచ్చిన ప్రతిమాట తూటాల్లా అక్కడున్న వారి హృదయాలను తాకింది.

"మన కుటుంబాలను రక్షించుకునేందుకు ప్రేమతో అందరం దగ్గరయ్యాం. అందరం కలిసికట్టుగా ధైర్యంతో ప్రేమగా పోరాడుదాం. నేను పిల్లలందరికీ ఒకటే చెప్పదల్చుకున్నా. మీరు ధైర్యంగా ఉండండి. మనం ఒంటరిగా లేము. గుండెల నిండా ప్రేమను నింపుకొన్న చాలామంది ప్రజలు మనతో ఉన్నారు. అందరం కలిసి మన హక్కుల కోసం పోరాడుదాం. దేవుడు మనతోనే ఉన్నాడు" అంటూ ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది. మెక్సికోకు చెందిన సోఫీ గతేడాది శరణార్థుల తరఫున పోరాడి డిఫైస్ అమెరికన్ అవార్డును సైతం అందుకుంది. గ‌తంలో పోరాట చ‌రిత్ర ఉన్న అమ్మాయి నూత‌న అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News