జనగామ జిల్లాలోని వాటర్ ట్యాంకులో అస్తిపంజరాలు.. పుకార్లకు చెక్ పెట్టిన పోలీసులు

Update: 2021-01-18 04:10 GMT
తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలోని నర్మెట మండల పరిధిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం తీవ్ర కలకలాన్ని రేపటమే కాదు.. పండుగ ఉత్సాహాన్ని కాస్తంత డిస్ట్రబ్ చేశాయని చెప్పాలి. పండక్కి పతంగులు ఎగురవేసుకుంటున్న పిల్లలు.. గాలి పటం వాడకుండా వదిలేసిన వాటర్ ట్యాంకులో పడటంతో దాన్ని తీసుకోవటం కోసం అక్కడకు వెళ్లారు. ట్యాంకు లోపల సీన్ చూసిన వారంతా వణికిపోయారు. ఊళ్లోకి వెళ్లి.. పెద్దలకు చెప్పటం.. కాసేపటికి చిన్నపిల్లల్ని చంపిన ట్యాంకులో పడేశారని.. అందుకే అస్తిపంజరాలు అన్ని ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరకు రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఆస్తిపంజరాల వెనుకున్న కథేమిటన్న విషయాన్ని తేల్చేయటంతో ఆ గ్రామం ఊపిరిపీల్చుకుంది.

నీళ్లు లేని ఆ ట్యాంకర్లో కొన్ని అస్తి పంజరాలు కనిపించటం.. చిన్నగా ఉండటంతో చిన్నారుల్ని చంపేసి.. అందులో పడేసి ఉంటారా? అన్న ప్రశ్నలతో పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇలాంటి వేళ విచక్షణ మరిచిపోతారన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే.. ఊళ్లో కాని చుట్టుపక్కల కానీ పిల్లలు మిస్ అయిన ఉదంతాలు లేనప్పుడు.. వెంటనే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పుకార్ల పుణ్యమా అని ఎవరికి వారు.. తోచింది మాట్లాడుకోవటం కనిపించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అస్తిపంజరాలు ఎవరివో తేల్చటానికి వెటర్నరీ అధికారుల్ని పిలిచారు. పరీక్షల్లో తేలిన నిజం ఏమంటే.. ఆ అస్తి పంజరాలు కోతులవి. పొరపాటున ట్యాంకులో పడటం.. ఊపిరి ఆడగ చనిపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందన్న విషయాన్ని గుర్తించారు. కొంతకాలంగా సదరు వాటర్ ట్యాంకర్ ను వాడకుండా వదిలేయటం.. దాని పై మూత లేకపోవటంతో.. పొరపాటున అందులో పడిన కోతులు చనిపోయినట్లుగా గుర్తించారు. దీంతో.. షికారవుతున్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.
Tags:    

Similar News