ఎల్‌.ర‌మ‌ణ‌పై చెప్పుదాడి..సోనియాకు ఫిర్యాదు

Update: 2018-11-20 04:09 GMT
మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు విక‌టిస్తోంది. కూట‌మి కట్టే నాటి నుంచే మొద‌లైన ఈ అసంతృఫ్తులు టికెట్ల పంపినీ ముగిసిన‌ప్ప‌టికీ ఇంకా కొన‌సాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేత‌లు త‌మ అంస‌తృఫ్తిని బ‌హిరంగంగానే వ్య‌క్తం చేస్తున్న స్థితి నుంచి బ‌హిరంగ దాడులు చేసే స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా ఏకంగా ఓ ముఖ్య నాయ‌కుడిపై చెప్పుదాడి య‌త్నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది. కోరుట్ల టికెట్‌ ను జువ్వాడి నర్సింగరావుకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి వర్గం భగ్గుమంది. చివరకు యత్నించిన తనకు కాదని - ప్యారాచూట్ వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారంటూ కొమిరెడ్డి రాములు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.  ఎల్‌.ర‌మ‌ణ‌పై చెప్పు దాడికి పాల్ప‌డ్డారు.

ఇటీవ‌లే కాంగ్రెస్‌ లో చేరిన జువ్వాడి న‌ర్సింగ‌రావుకు కోరుట్ల టికెట్ ద‌క్కింది. దీంతో తమ నాయకుడికి టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ కాంగ్రెస్‌ కు చెందిన కొమిరెడ్డి రాములు అనుచరులు జాతీయరహదారిపై మాజీఎంపీ మధుయాష్కీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నల్లబ్యాడ్జీలతో పట్టణంలో బైక్‌ ర్యాలీ తీశారు. జువ్వాడి నర్సింగరావు సోమవారం టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి నామినేషన్ వెళుతుండగా - కొమిరెడ్డి రాములు ఇంటి సమీపంలోకి రాగానే ఆయన మద్దతుదారులు ఎల్ రమణ - జువ్వాడి నర్సింగరావు - మధుయాష్కీగౌడ్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వ్యక్తి ఎల్ రమణపై చెప్పు విసిరారు. అది అటుగా వెళుతున్న బస్సుపై పడింది. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కోరుట్ల కాంగ్రెస్ టికెట్‌ ను టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ - మాజీ ఎంపీ మధుయాష్కీ రూ. 5కోట్లకు అమ్ముకున్నారని మాజీఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి ఆరోపించారు. టికెట్ అమ్ముకున్న విషయాన్ని సోనియా - రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళతానని ఆమె వెల్ల‌డించారు. ఈ నెల 22లోపు టికెట్ మార్పించి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తానని ప్ర‌క‌టించ‌డం కొసమెరుపు.
Tags:    

Similar News