స్మార్ట్ షాక్: ఆన్ లైన్లో కొత్త జంట ఫస్ట్ నైట్

Update: 2020-01-21 09:17 GMT
మన ప్రైవసీ ని టెక్నాలజీ దోచేస్తోంది. మొన్నీ మధ్యే అమెరికాలోని ఓ చిట్టడివిలో ఇక్కడికి ఎవరూ రారని భ్రమపడిన ఓ జంట.. రోడ్డు పక్కన సెక్స్ మొదలుపెట్టింది. అయితే ఆ చిట్టడివి గుండా వెళ్లిన గూగుల్ మ్యాపింగ్ కెమెరా వీరి సెక్స్ వీడియోను బంధించి వారి బండారాన్ని ప్రపంచమంతా చూసేలా చేసింది. ఈ ప్రపంచంలో మనకు ప్రైవసీ లేదన్న వాస్తవాన్ని కళ్లకు గట్టింది. కాదేదీ హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. అంతా స్మార్ట్ యుగం.. మనం ఎక్కడికెళ్లేది గూగుల్ మ్యాప్ గుర్తిస్తుంది. మనం ఏం చేశామన్నది సీసీ కెమెరాలు గుర్తిస్తాయి. మన స్మార్ట్ ఫోన్ చూస్తే మన గుట్టు అంతా తెలిసిపోతుంది. బ్యాంకులు, ఇతర ట్రాన్స్ క్షన్లు అన్నీ మన గుట్టును బయట పెడుతున్నాయి. హ్యాకింగ్ టెక్నాలజీ తో మన ప్రైవసీ దెబ్బ తింటుందనానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచి పోతోంది.

ఢిల్లీ  శివారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నోయిడా అది.. కొత్త జంటకు ఘనంగా పెళ్లి చేశారు. వారి శోభనానికి అదిరి పోయే రీతి లో ఏర్పాట్లు చేశారు. తొలి రేయి పై ఎన్నో కలలుగన్న ఆ జంట అనుకున్నట్టే తొలి శోభన రాత్రినాడు దున్నేశారు. తనివితీరా ఎంజాయ్ చేశారు. ఎన్నో మధురానుభూతులను పొందారు.. కట్ చేస్తే..

వీరిద్దరి ఫస్ట్ నైట్ శృంగార వీడియో పోర్న్ సైట్లలో ప్రత్యక్షమైంది. పోర్న్ వీడియోలు చూసిన యువకుడు ఇది తమ ఫస్ట్ నైట్ వీడియో అని తెలుసుకొని నిర్ఘాంత పోయాడు. ఎవరైనా వీడియో తీశారా అని ఇల్లంతా వెతికాడు.. గాలించాడు. ఎక్కడా వీడియో కనపడలేదు. మరి మా ఫస్ట్ నైట్ పోర్న్ వీడియో లో ఎలా ఎక్కిందని కంగారు పడ్డాడు. భార్యకు విషయం చెప్పాడు. లబోదిబోమన్న ఇద్దరూ చివరకు ధైర్యం సైబర్  క్రైమ్  పోలీసులను ఆశ్రయించారు.

ఈ కేసు ను ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు వారి బెడ్రూమ్ మొత్తం ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయోనని శూలశోధన చేశారు. కానీ ఎక్కడా పోలీసులకు కెమెరాలు చిక్కలేదు. చివరకు అసలు విషయం కనుక్కున్నారు.

బెడ్రూమ్ లో ఉన్న స్మార్ట్  టీవీనే  ఈ కొత్త జంట వీడియో తీసిందని తేల్చారు. స్మార్ట్ టీవీకి  వైఫై కనెక్షన్ ఉండడంతో దాన్ని హ్యాక్ చేసిన దుండగులు స్మార్ట్ టీవీకున్న ఇన్ బిల్ట్ కెమెరాతో వీరి శోభనం రికార్డ్ చేసి పోర్న్ సైట్లో పెట్టినట్టు తేల్చారు. ఇది చేసింది విదేశీయులేనని గుర్తించారు. దీంతో అవాక్కవ్వడం ఆ కొత్త జంట వంతైంది.

ఇలా స్మార్ట్ యుగంలో ఏదీ మనం దాచలేమని.. అత్యంత చాకచక్యంగా ఉండడమే మనం చేసే ప్రథమ కర్తవ్యమని ఈ ఉదంతంతో అందరికీ అర్థమై పోయింది.
Tags:    

Similar News