మానసిక ఒత్తిడికి పొగతాగడం కారణం

Update: 2021-03-09 00:30 GMT
పొగతాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం. ఇప్పుడు మందు విందు, సిగరెట్ అనేది పిచ్చకామన్ గా మారిపోయింది. ఆడవారు కూడా సిగరెట్లు కాల్చేస్తున్నారు.అయితే అందరూ ఒత్తిడి నుంచి బయటపడడానికి సిగరెట్ ను కాలుస్తుంటారు. దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. కానీ స్మోకింగ్ చేస్తే అనేక మానసిక సమస్యలు వస్తాయని తాజాగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడుతారని అధ్యయనాలు  చెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 462690 మందికి సంబంధించిన బయో బ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు.స్మోకింగ్ వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. అలాగే ఇతర మానసిక ఆరోగ్యసమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
Tags:    

Similar News