ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని.. పెద్దవాళ్లు అదిలించటం.. తప్పు చేయొద్దని చెప్పటం మామూలే. మరి.. పెద్దోళ్లే తప్పు చేస్తే ఎవరేం అనరా? ఆరోగ్యానికి విపరీతంగా హాని చేసే సిగిరెట్ కాల్చటాన్ని అడ్డుకోవాలని భావించిన లోక్ సభ స్పీకర్ ప్రయత్నం నీరు కారింది.
పార్లమెంటులోని లోక్ సభ సభ్యల్లో పొగరాయుళ్లకు పొగ తాగేందుకు వీలుగా ఉండే రూమను స్టెనో గ్రాఫర్లకు కేటాయించి.. ఎంపీలు ధూమపానానికి దూరంగా ఉండేలా చేయగలిగారు. అయితే.. తమ ఆరోగ్యం కంటే కూడా సిగిరెట్ కాల్చటం మీద మోజున్న ఈ పొగరాయుళ్లు పార్టీలకు అతీతంగా స్పీకర్ వద్దకు వెళ్లారు. సిగిరెట్ తాగేందుకు గతంలో కేటాయించిన హాలును మళ్లీ పొగతాగేందుకు ఏర్పాటు చేయాలని కోరారు.
ధూమపానం చేసే చోటు ఈ ఎంపీ పెద్దలకు తెలిసినా.. వారికి సుద్దులు చెప్పే పని ఎవరు చేయగలరు? అందుకేనేమో.. ఈ ప్రక్రియకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పం తీసుకున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పార్టీల హద్దులు చెరిపేసి మరీ.. తన వద్దకు వచ్చిన ఎంపీల డిమాండ్ కు ఆమె తలొగ్గక తప్పలేదు. గతంలో ఉన్న విధంగా దమ్ము తీసేందుకు వీలుగా పార్లమెంటు భవనంలో ఉన్న పొగతాగే గదిని మళ్లీ అందుకే వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ గదిలో ఏర్పాటు చేసిన స్టెనోగ్రాఫర్లకు స్థాన చలనం కల్పించారు. మొత్తానికి తమ వ్యక్తిగత ఇష్టాన్ని పార్టీలకు అతీతంగా పోరాడి విజయం సాధించారు. ఒకే అంశంపై అధికార.. విపక్షాలు రెండు గెలవటం ఇదేనేమో.