కేంద్ర మహిళామంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఏ విషయం గురించి అయినా కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేస్తుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉత్తర ప్రదేశ్ లో స్మృతి ఇరానీ ఓడించిన సంగతి తెలిసిందే. దీనితో ఆమె పాపులారిటీ అమాంతం రెట్టింపైంది. నిత్యం రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలను, ఫోటోలను సరదా పోస్ట్ లను షేర్ చేస్తూఉంటారు.
తాజాగా ఆమె చేసిన ఓ ఫన్నీ పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా అంటూ పోస్ట్ చేసి అందర్నీ నవ్వించారు స్మృతి ఇరానీ. ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు అంటూ పోస్ట్ చేశారు. ఆపై ఒక అంచనాకు వచ్చి పెళ్లి చేసుకోడంటూ సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలో పోస్ట్ చేశారు స్మృతి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పెళ్లి తర్వాత జీవితం సుఖసంతోషాలతో సాగాలంటే దంపతులిద్దరికీ ఓర్పు, సహనం ఎంతో ముఖ్యమని ఆమె ఫన్నీ గా తెలియజేశారు. ఆవేశం మనిషిలో విచక్షణను చంపేస్తుందని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. దేనికైనా సహనం అనేది ప్రధానం.మరో పోస్ట్ కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ... ఏ పదార్థమూ పర్ ఫెక్ట్ గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి’’ అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ.. వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.