గాంధీ ఫ్యామిలీకి భూదాహం ప‌ట్టిందా?

Update: 2015-08-24 12:43 GMT
అధికార బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పంచాయితీ రోజురోజుకి ముదురుతోంది. ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం ఎక్కువైంది. సూటు బూటు స‌ర్కారు అంటూ మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ విమ‌ర్శిస్తుంటే.. మ‌రోవైపు.. ఆయ‌న తీరును.. ఆయ‌న ఫ్యామిలీ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ కొత్త ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. గాంధీ కుటుంబ స‌భ్య‌ల మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌లు త‌క్కువే.

తాజాగా.. మంత్రి ఇరానీ మాట్లాడుతూ.. అమేధిలో రాజీవ్ గాంధీ ట్ర‌స్ట్ అక్ర‌మంగా కొనుగోలు చేసిన భూమి గురించి ఆమె నిల‌దీస్తున్నారు. సైకిల్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన భూమిని.. గాంధీ ఫ్యామిలీకి చెందిన రాజీవ్ గాంధీ ట్ర‌స్ట్ కు ఎలా స్వాధీనం చేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పేద‌ల నుంచి సేక‌రించిన భూమిలో 65 ఎక‌రాల భూమిన .. సైకిల్ ఫ్యాక్ట‌రీ కోసం కాకుండా.. రాజీవ్‌గాంధీ ట్ర‌స్ట్ భూమిని ఎలా కొనుగోలు చేసింద‌ని ప్ర‌శ్నించారు. గ‌జం భూమిని కూడా వృధా పోనివ్వ‌మ‌ని మాట్లాడిన రాహుల్‌గాంధీ.. త‌న కుటుంబం చేసిన అవినీతి మాటేమిటంటూ నిల‌దీశారు. సైకిల్ ఫ్యాక్ట‌రీకి కోసం కేటాయించిన భూమిని రాజీవ్ గాంధీ ట్ర‌స్ట్ కొనుగోలు చేయ‌టం రానున్న రోజుల్లో మ‌రెంత లొల్లికి దారి తీస్తుందో..?
Tags:    

Similar News