లోక్ సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న అమేధీ పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ అభ్యర్థి - కేంద్రమంత్రి స్మృతీ జుబిన్ ఇరానీ గెలిస్తే చారిత్రాత్మకం అవుతుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ స్థానానికి 1967 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. కాగా 1977లో జనతాదళ్ అభ్యర్థి రవీంద్రప్రతాప్ సింగ్ గెలిచారు. అనంతరం 1998లో బీజేపీ నుంచి సంజయ్ సిన్హా విజయం సాధించారు. కాగా మిగతా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఇక్కడి నుంచి నెహ్రూ కుటుంబసభ్యులు ఎక్కువ మంది గెలిచారు. నెహ్రూ కుటుంబసభ్యులు అమేధీ నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం రాహుల్ గెలిస్తే పదో విజయం అవుతుంది. సంజయ్ గాంధీ - రాహుల్ గాంధీ - రాజీవ్ గాంధీ - సోనియాగాంధీ గెలిచారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
1980 నుంచి మొదలు…
ఆరంభం నుంచి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చినా.. 1977లో జనతాదళ్ అభ్యర్థి గెలిచారు. దీంతో 1980 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే ఏడాది ఆయన హత్యకు గురి కావడంతో మరో తనయుడు రాజీవ్ గాంధీ 1981లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా 1984 - 1989 - 1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ వరుస విజయాలు సాధించారు. అయితే ఆయన 1991లో హత్యకు గురయ్యారు. అమేథీ నుంచి గెలిచిన వారిలో రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టిన వారిలో ఏకైక సభ్యుడు కావడం విశేషం. అయితే 1998తో దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉండటంతో అమేధీ నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ సిన్హా విజయం సాధించారు. అమేధీ కోటపై తొలిసారి కమలం వికసించింది.
1999లో సోనియాగాంధీ నుంచి..
1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవడంతో రాజీవ్ గాంధీ సతీమణి సోనియాగాంధీ 1999 ఎన్నికల్లో కర్నాటకలోని బళ్లారితో పాటు అమేధీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అయితే బళ్లారికి రాజీనామా చేశారు. తర్వాత 2004లో ఆమె రాయ్ బరేలి పార్లమెంటు స్థానానికి బదిలీ అయ్యారు. తనయుడు రాహుల్ గాంధీని అమేధీ బరిలో దించారు. ఆయన 2004 - 2009 - 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం నాల్గోసారి బరిలో దిగారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ నాలుగుసార్లు విజయం సాధించారు. తనయుడు రాహుల్ గాంధీ విజయం సాధిస్తారా? లేక బీజేపీ చేతిలో ఓడిపోతారో వేచి చూడాలి.