తన అందంతో పాటు ఆటతీరుతో పలువురిని ఆకట్టుకుంది భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన. ప్రస్తుతం ఈ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఈ క్రికెటర్ గురించి ఎవరికీ తెలీదు. ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 72 బంతుల్లో 90 పరుగులు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. వెస్టిండీస్ పై జరిగిన రెండో మ్యాచ్ లో ఏకంగా సెంచరీతో అందరినీ ఆకట్టుకుంది.
అయితే, స్మృతి అనూహ్యంగా ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో స్మృతి (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరింది. దీంతో దుఃఖాన్ని ఆపుకోలేక స్మృతి డ్రెస్సింగ్ రూమ్ లో బోరున ఏడ్చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్మృతి అందమైన నవ్వు చూసి మనసు పారేసుకున్న కుర్రకారు ఈ వీడియోని చూసి తెగ ఫీలవుతున్నారట.
ఆస్ట్రేలియాతో ఓడిపోయి సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. దీంతో 15న న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న మిథాలీరాజ్ సేన సెమీస్ కు చేరాలంటే శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై తప్పక గెలవాలి. లేదంటే లీగ్ దశలో ఇంటిదారి పట్టవలసి వస్తుంది.