10వేల పాముల్ని పట్టేశాడు.. కనిపించని కరోనా కాటుకు బలయ్యాడు

Update: 2021-05-17 03:26 GMT
ఎంతటి విష సర్పమైనా సరే.. అతనికి తలొగ్గాల్సిందే. అతడి కన్ను పడితే చాలు.. ఎంతటి ప్రమాదకరమైన పాము అయినా సరే.. అతడి చేతులకు ఒడుపుగా చిక్కేస్తుంది. బుద్దిగా ఉంటుంది. అలాంటి వ్యక్తి.. కంటికి కనిపించని మహమ్మారి కరోనా బారిన పడి మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఇళ్లు.. ఆఫీసులు.. ఇక్కడా అక్కడా అనన తేడా లేకుండా పాములున్న చోటును సులువుగా గుర్తించి.. వాటిని ఇట్టే పట్టేసుకునే టాలెంట్ తమిళనాడుకు చెందిన స్నేక్ స్టాన్లీ సొంతం. ఇప్పటివరకు పది వేలకు పైగా పాముల్ని పట్టుకున్న ట్రాక్ రికార్డు అతని సొంతం.

చెన్నైతో పాటు చుట్టుపక్కల ఎక్కడైనా సరే పాము కనిపిస్తే.. వెంటనే స్టాన్లీ గుర్తుకు వస్తాడు. అరవైఏళ్ల వయసులోనూ పాముల్ని పట్టుకోవటంలో అతడి చాకచక్యానికి ఫిదా కావాల్సిందే. అస్సలు భయమన్నది లేకుండా పాముల్ని పట్టి.. వాటిని క్షేమంగా అధికారులకు అందించే స్లాన్టీ ఐదు రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. అతడి పరిస్థితి విషమించటంతో చైన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు.

అతడికి భార్య.. కుమార్తె.. కుమార్తె ఉన్నారు. స్లాన్టీ మరణం పలువురిని విషాదానికి గురి చేస్తోంది. ప్రమాదకరమైన పాము అన్నంతనే గుర్తుకు వచ్చే స్టాన్లీ పాతికేళ్ల కాలంలో పదివేలకు పైగా పాముల్ని పట్టుకున్నాడు. ఎంతటి విష సర్పమైనా ఒడుపుగా పట్టుకునే అతను.. కరోనాను హ్యాండిల్ చేసే విషయంలో త్రోటుపాటుకు గురి కావటమే కాదు.. ప్రాణాల్ని విడవాల్సి వచ్చింది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా వేదనకు గురవుతున్నారు.
Tags:    

Similar News