ఇమ్రాన్ కోసం చెప్పులు రెఢీ చేసి చిక్కుల్లో ప‌డ్డాడు!

Update: 2019-06-05 04:40 GMT
రంజాన్ సంద‌ర్భంగా దేశ ప్ర‌ధానికి అంద‌మైన చెప్పులు త‌యారు చేసి ఇవ్వాల‌నుకున్న ఒక వ్య‌క్తి చిక్కుల్లో ప‌డ్డ వైన‌మిది. అయిన‌ప్ప‌టికీ అత‌గాడు తాను చేసిన చెప్పుల్ని ప్ర‌ధానికి ఇచ్చేందుకు ప‌డుతున్న ఆరాటం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఇదెక్క‌డంటే.. మ‌న పొరుగునే ఉన్న పాక్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌గా చెప్పాలి.

పాక్ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు రంజాన్ సంద‌ర్భంగా చెప్పుల్ని బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని భావించాడు పెషావ‌ర్ లోని జ‌హంగీర్ పురా బ‌జార్ లోని నూరుద్దీన్ షిన్వారీ. చెప్పుల దుకాణం ఉన్న అత‌గాడు.. అంద‌మైన చెప్పుల జ‌త‌ను పండ‌గ వేళ ప్ర‌ధానికి ఇవ్వాల‌న్న ఆరాట‌ప‌డ‌డ్ఆడు. అందుకోసం పాము చ‌ర్మంతో రెండు ప్ర‌త్యేకమైన చెప్పుల జ‌త‌ల్ని త‌యారు చేశారు. ఒక‌టి తాను వాడుకునేందుకు.. మ‌రొక‌టి ప్ర‌ధానికి ఇవ్వాల‌ని అనుకున్నాడు.

ఈ విష‌యం అట‌వీశాఖ‌.. వ‌ణ్య‌ప్రాణి సంర‌క్ష‌ణ శాఖ‌కు స‌మాచారం అందింది. వెంట‌నే వారు క‌స్ట‌మ‌ర్ల మాదిరి అత‌డి షాపుకి వెళ్లి  ఆ రెండు చెప్ప‌ల జ‌త‌ల్ని ప‌రీక్షించారు. అయితే.. ఈ రెండు జ‌త‌లు పాముచ‌ర్మంతో త‌యారు చేసిన‌ట్లుగా నిర్దారించారు. పెథాన్ చ‌ర్మంతో చేసిన ఈ చెప్పుల జ‌త‌ల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. చెప్పుల్ని త‌యారు చేసిన పాము చ‌ర్మం త‌న‌కు అమెరికాకు చెందిన వ్య‌క్తి పంపిన‌ట్లుగా వెల్ల‌డించారు. దీంతో.. అధికారులు అత‌నికి రూ.50వేల ఫైన్ వేశారు.

కొస‌మెరుపు ఏమంటే.. త‌న‌కు జ‌రిమానా వేసిన అధికారుల‌కు ఆ డ‌బ్బుల్ని ఆనందంగా క‌ట్టేసిన స‌ద‌రు వ్యాపారి.. ఇప్పుడా చెప్పుల జ‌త‌ను ప్ర‌ధాని ఇమ్రాన్ కు ఇచ్చేందుకు హుషారుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి.. ఈ చెప్పుల్ని ప్ర‌ధాని ఇమ్రాన్ తీసుకుంటారా?  లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News