జ‌గ‌న్‌కు ఇంత మంది శ‌త్రువులా...!

Update: 2021-06-15 00:30 GMT
ఏ రంగంలో అయినా మ‌నిషికి శ‌త్రువు ఉండ‌డం స‌హ‌జం. రాజ‌కీయ రంగంలో అయితే శ‌త్రువుల ఎత్తులు, పై ఎత్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఓ కంట క‌నిపెడుతూ ఉండాలి. వీరిని క‌నిపెడుతూ రాజ‌కీయం చేయ‌క‌పోతే ఎప్పుడు ఎటు వైపు నుంచి ప్ర‌మాదం ముంచుకు వ‌స్తుందో ?  తెలియ‌దు. అందుకే రాజ‌కీయ నాయ‌కులు అంద‌రూ ఈ శ‌త్రువ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ శ‌త్రువుల ప్ర‌తిప‌క్ష‌, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌లోనే కాకుండా.. సొంత పార్టీలో ఉంటూ కూడా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం శ‌త్రువుల చ‌క్ర‌బంధంలో చిక్కుకు పోతున్నారా ?  రోజు రోజుకు ఆయ‌న‌కు శ‌త్రువులు పెరిగిపోతున్నారా ? అంటే అవున‌నే తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్పుడు నాడు కాంగ్రెస్‌లో ఉన్న మ‌హామ‌హుల‌తో పాటు సోనియాగాంధీ చంద్రబాబు ప్రధాన శత్రువులుగా ఉండేవారు. 2010 నుంచి జ‌గ‌న్ ఎన్నో పోరాటాలు చేస్తేనే ప‌దేళ్ల‌కు 2019లో సీఎం అయ్యారు. ఈ ప‌దేళ్ల‌లో జ‌గ‌న్ ఎదుర్కొన్న క‌ష్టాలు, జ‌గ‌న్ ఎదుర్కొన్న శ‌త్రువుల సంఖ్య‌కు లెక్కేలేదు. 2014కు ముందు వ‌ర‌కు జ‌గ‌న్ తెలంగాణ కాంగ్రెస్ నేతల మాట‌ల తూటాలు మామూలుగా ఎదుర్కోలేదు. రాష్ట్ర విభ‌జ‌న అంశం ఓ వైపు, ఇటు పార్టీని నిల‌బెట్టుకోవ‌డం, అటు సీనియ‌ర్ల‌ను, రాజ‌కీయంగా త‌ల‌పండిన నేత‌ల‌ను ఎదుర్కోవ‌డం మామూలు విష‌యం కాదు.

ఇదంతా గ‌తం.. ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇంకా ఎక్కువ మంది శ‌త్రువుల ఉన్నారు. జ‌గ‌న్‌కు నాటికి నేటికి శ‌త్రువుల విష‌యంలో తేడా రావ‌డ‌మే కాదు... ఇప్పుడు అనేక స‌మ‌స్య‌ల‌తో కూడా శ‌త్రువులు పెరిగిపోతున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నా... వాటితో సంతృప్తి చెంద‌ని వ‌ర్గాలు... అటు కేంద్రంలో బ‌లంగా ఉన్న బీజేపీ, ఇటు ఏపీలో ప‌రువు కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా పోరాటం చేస్తోన్న టీడీపీ నాయ‌కులు, చంద్ర‌బాబు ఇలా ఎంద‌రినో జ‌గ‌న్ ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంది.

ఇక క‌రోనా వ‌ల్ల ఏపీలో చాలా వ‌ర్గాలు సంతృప్తిగా లేవు. ఇసుక స‌మ‌స్య‌కు తోడు, ప్ర‌భుత్వ ఉద్యోగుల అసంతృప్తి, నిరుద్యోగుల అసంతృప్తితో జ‌గ‌న్‌కు ఇటీవ‌ల కాలంలో చాలా మంది శ‌త్రువులు పెరుగుతున్నారు. మ‌రి ఈ వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్ గ‌మ‌నిస్తున్నారో ?  లేదో ?  కాని జ‌గ‌న్ హానీమూన్ పీరియ‌డ్ అయితే ముగిసింది.. జ‌గ‌న్ ఇప్ప‌ట‌కి అయినా ఈ శ‌త్రువుల సంఖ్య‌ను త‌గ్గించుకోక‌పోతే 30 ఏళ్ల ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఐదేళ్ల ముచ్చ‌టే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News