లక్షల్లో జీతం.. ఐదు రోజులే పని. చేతినిండా పైసలుంటే ఎవరికి మాత్రం ఎంజాయ్ చేయ బుద్ధి కాదు చెప్పండి. ఇక సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పని చేసే వారైతే వీకెండ్ కోసం చకోర పక్షుల్లా వెయిట్ చేస్తూ ఉంటారు. వీకెండ్ వస్తే చాలు క్లబ్బులు.. పబ్బులు.. దావత్ లంటూ నానా హంగామా చేస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే.
అసలే ఇయర్ ఎండింగ్.. దీనికి తోడు క్రిస్మస్ పార్టీల హంగామా నగరాల్లో అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ టెక్కీ తన వీకెండ్ ను అదిరిపోయేలా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది. ఆన్ లైన్ మంచి కిక్కు ఇచ్చే మందు బాటిల్ కోసం వెతికింది. ఈక్రమంలోనే ఒక కంపెనీకి చెందిన బ్రాండ్ మందు ఆమె కంటపడింది.
దానిని ఆన్ లైన్ లో బుక్ చేసేందుకు ప్రయత్నించగా పేమెంట్ కాలేదు. దీంతో సదరు కంపెనీ కస్టమర్ కేర్ ఫోన్ చేసి సమస్యను వివరించింది. అయితే కస్టమర్ బ్యాంక్ డిటైల్స్ అడగగా ఆమె నిరాకరించింది. అయితే అతడే ఫోన్ చేసి క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పగా అతడు చెప్పినట్లు చేసింది. రూ.900 వైన్ బాటిల్ కు ఏకంగా 96 వేల 902 రూపాయలు కట్ అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది.
దీంతో కంగుతిన్న ఆమె షాక్ నుంచి కోలుకోని పూణే పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువతి పూణేలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కలిసి రావడంతో ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని టెక్కీలు డిసైడయ్యారు.
ఈ క్రమంలోనే ఆన్ లైన్ ఓ మంచి బ్రాండ్ కోసం ఆ మహిళా టెక్కీ వెతికింది. ఆమె చూసిన బ్రాండ్ కొనేందుకు ప్రయత్నించగా ఆర్డర్ కాకపోవడంతో కస్టమర్ కేర్ తో మాట్లాడింది. అయితే అవతలి నుంచి మాట్లాడిన వ్యక్తి ఆ లేడీ టెక్కీకి మస్కా కొట్టాడు. మొదట బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడుగగా ఆమె నిరాకరించింది.
క్యూర్ కోడ్ స్కానింగ్ కోడ్ పంపాడు. దీనిని ఆమె స్కానింగ్ చేసిన మందు బాటిల్ ఆర్డర్ చేసింది. అయితే ఆ తర్వాత అతడే మళ్లీ క్యూర్ కోడ్ స్కాన్ వివరాలు కావాలని కోరగా ఆమె చెప్పింది. ఆ వెంటనే ఆమె అకౌంట్ నుంచి 96 వేల 902 రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె అవతలి వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
రూ.900ల వైన్ బాటిల్ ఆన్ లైన్ ఆర్డర్ చేస్తే ఏకంగా లక్ష రూపాయలు అకౌంట్ నుంచి మాయం కావడంతో ఆమెకు మందు కొట్టకుండానే పుల్ బాటిల్ కిక్కు ఎక్కినంత పనైంది. ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే పూణేలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి చీటింగ్ కేసు పెట్టింది. ఆ లేడి టెక్కీ చెప్పిన వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.