తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సంగతేమో కానీ.. ఆ పేరిట జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు.. దానిపై తమిళ సంఘాలు విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇది సరిపోదన్నట్లుగా తలైవాపై.. లోకనాయకుడిగా పిలుచుకునే ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఒక జాతీయ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన కమల్ హాసన్.. రజనీపై సెటైర్లు వేశారు.
కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ కనిపిస్తారన్న కమల్.. ఆయనకు కెమెరాలు కనిపిస్తే హడావుడి చేయటం అలవాటే.. అందుకే హడావుడి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సామాజిక కోణంలోనే టీవీ షో చేస్తున్నట్లుగా పేర్కొన్న కమల్.. ప్రజలతో మమేకం కావటం కోసమే తాను టీవీ షో చేస్తన్నట్లుగా వెల్లడించారు. ఓపక్క రజనీ పొలిటికల్ ఎంట్రీపై తమిళ సంఘాలు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాను తమిళుడినేనంటూ రజనీ చెప్పటం.. దానికి వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వేళ.. రజనీకి పాత మిత్రుడిగా పేరున్న కమల్.. తలైవాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎన్ని ఎదురవుతాయో?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/